నేటితో గూగుల్‌కు 20 ఏళ్లు...

నేటితో గూగుల్‌కు 20 ఏళ్లు...

గూగుల్… మన జీవితంలో భాగమైపోయింది. ఎప్పుడు ఏ సమాచారం కావాలన్నా దీన్ని ఆశ్రయించాల్సిందే. ఏ చిన్నపాటి అనుమానం కలిగినా గూగుల్‌తో మొర పెట్టుకోవాల్సిందే. పిల్లలకూ, పెద్దలకూ… ఇలా ఒక వయసు పరిమితంటూ లేకుండా… ఇంటిళ్లపాదికీ తలలో నాలుక గూగుల్‌ తల్లే. ఎలాంటి సమచారాన్నైనా ఇట్టే మన ముందు ఉంచేస్తుంది. మన అందరి జీవితాల్లో ఇంత ప్రాధాన్యతను సంతరించుకున్న గూగుల్‌కు ఈ రోజు 20 వ పుట్టిన రోజు… ఈ సందర్భంగా అసలు మన గూగుల్‌ ఎలా పుట్టిందో తెలుసుకుందాం  పదండి…

కాలంతో పోటీ పడ్డారు…

గూగుల్‌ మొదలై నేటితో సరిగ్గా 20 ఏళ్లు. రెండు దశాబ్ధాల క్రితం స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు పీహెచ్‌డీ విద్యార్థులు దీన్ని ప్రారంభించారు. ఏ సమాచారాన్నైనా ఒకే వేదికపై ప్రపంచానికి అందచేయాలనే ఆలోచనలో నుంచే ఇది పుట్టింది. 1998 లో స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ పీహెచ్‌డీ విద్యార్థులు సర్జీ బ్రిన్‌, లారీ పేజ్‌లు ఈ అందమైన కల కన్నారు. కాలంతో పోటీ పడ్డారు. తమని తాము నిరూపించుకున్నారు. ప్రపంచానికి గూగుల్‌ను ఇచ్చారు. అలా ఇరవై ఏళ్ల క్రితం ప్రారంభమైన గూగుల్‌… ఇప్పుడు 150 భాషల్లో 190 దేశాల్లో సేవలందిస్తోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *