ఫోన్ కొనలేదని నడిరోడ్డులో కొట్టిన ప్రియురాలు!

ఫోన్ కొనలేదని నడిరోడ్డులో కొట్టిన ప్రియురాలు!

ప్రేమించడం మనుషులెవరికైన సులభంగా వచ్చే పని. కానీ ప్రేమించిన అమ్మాయిని ఆనందంగా చూసుకోవడమనేదే అందరికీ చేతకాని విషయం. ప్రియురాలు ఉంటే సరిపోద్ది..నలుగురికి చెప్పుకోవడానికి, పెళ్లి చేసుకుని గడిపేయడానికి అనుకుంటే పొరపాటే..చైనాలో జరిగిన ఈ సంఘటన చూస్తే..ప్రియురాలిని సంపాదించడం కంటే తనని సంతోషంగా చూసుకోవడంలో ఎంత కష్టం ఉందో తెలుస్తుంది. ప్రియురాలు అడిగిన ఫోన్ తెచ్చివ్వలేదని సదరు ప్రియుడిని నడిరోడ్డులో 52సార్లు చెంపమీద కొడుతూ ఆమె కోపాన్ని తీర్చుకుంది. కేవలం ఫోన్ కొనివ్వలేదని 52 సార్లు కొట్టడం ఏంటనీ, ఆమెకు బుద్ధి లేదా అని మీరు కూడా కోప్పడవచ్చు కానీ ఈ ఘటనలో ఆమె కోపం కంటే ప్రియుడి పొరపాటు తెలిస్తే ఆమెను ఏమీ అనరు.

చైనాలో జరిగింది ఈ సంఘటన. సిచువాన్‌లోని ఓ వీధిలో తన ప్రియురాలిని కలవడానికి వచ్చాడు యువకుడు. మే 20న చైనాలో ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆమె ఫోన్ కొనివ్వమని కోరింది. డబ్బుల్లేకనో, మర్చిపోవడం వల్లనో అతను ఒట్టి చేతులతో ప్రియురాలితొ ఎంజాయ్ చేయడానికి రావడంతో ఆమె కోపం నషాలానికి ఎక్కింది. తన కోపాన్ని అణుచుకోలేక అతని చెంప ఛళ్లు మనిపించింది. అదికూడా ఒకటి రెండు సార్లు కాదు ఏకంగా 52 సార్లు, ఆ వీధిలో అందరూ చూస్తుండగానే కొట్టింది. ఈ దృశ్యాల్ని చూస్తున్న జనంలో ఎవరూ కూడా ఆమెను ఆపడానికి కానీ, నిలువరించడానికి కానీ రాకపోవడం ఆశ్చర్యం. పైగా వారి ఫోన్‌లలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడానికి వచ్చారు. అయితే…ప్రియురాలి కోపంలో న్యాయం ఉందని భావించిన ప్రియుడు తమ వ్యక్తిగత విషయంలో పోలీసుల జోక్యం వద్దని వారితో వాదానికి దిగాడు.

ఇలా చేయడం తప్పని భావించిన పోలీసులు వారిద్దరికీ కౌన్సిలింగ్ ఇప్పించారు. ఆ తర్వాత చర్చల్లో తెలిసిన విషయం ఏంటంటే…గత కొన్నాళ్లుగా సదరు యువకుడికి ఆ ప్రియురాలు ఆర్థికంగా సాయం చేస్తూనే ఉందట. ప్రేమికుల దినోత్సవం కావడంతో తనకు ఇష్టమైన ఫోన్ కొనివ్వాలని అడిగినా తేకపోవడంతో ఆమెకు కోపం వచ్చింది. తప్పు చేశానని అనుకున్నాడో ఏమో ఆమె అన్నిసార్లు కొట్టిన అతను మౌనంగా ఉండిపోయాడు. ఈ జంటను చూసిన జనం మాత్రం వీరి ప్రేమకు ఫిదా అయిపోయారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *