వాట్సాప్‌తో సంపాదన

వాట్సాప్‌తో సంపాదన

మెసేజింగ్ యాప్‌గా అత్యంత ప్రజాదారణ కలిగి, ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లమంది యూజర్లను కలిగివున్న వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫీచర్‌లో స్టేటస్ అప్‌డేట్‌లో యాడ్స్ వస్తుందని తెలిపింది. వాట్సాప్ ద్వారా కూడా ఆదాయం పొందడానికి ఈ ఫీచర్ తీసుకువస్తున్నట్టు వాట్సాప్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్ డేనియల్స్ చెప్పారు. ఇకముందు వాణిజ్య ప్రకటనలు కూడా వాట్సాప్‌లో పెడతామని తెలిపారు. ఈ కొత్త ఫీచర్ ఎలా ఉండబోతోందో తెలుసుకోవడానికి దాదాపు 100 కంపెనీలు పరీక్షిస్తున్నాయి.

Whats Up Ads

కొత్తసంవత్సరం నుంచి…

వాట్సాప్ స్టేటస్‌లో ఈ యాడ్స్ వస్తాయని…మోనటైజేషన్ వ్యవహారాన్ని ఫేస్‌బుక్ చూసుకుంటుందని క్రిస్ డేనియల్స్ అన్నారు. ఈ యాడ్స్ ప్రదర్శించినందుకు ఫేస్‌బుక్ ఆయా కంపెనీల నుంచి కొంత రుసుము వసూలు చేయనుంది. ప్రకటనలకర్తల ప్రొఫైల్‌తో ఈ యాడ్స్‌ను లింక్ చేస్తారు. ఈ కొత్త ఫీచర్ వచ్చే ఏడాది నుంచి ప్రారంబం అవొచ్చని భావిస్తున్నారు. ఈ యాడ్స్ ఎలా వుంటాయనేది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. యూజర్ల ఆసక్తిని బట్టి ఆ యాడ్స్ ఉండబోతున్నట్టు, స్టేటస్ అప్‌డేట్ అనేది 24 గంటలు మాత్రమే ఉంటుంది కాబట్టి యూజర్ల స్టేటస్‌ని బట్టి ఆటోమెటిక్‌గా యాడ్స్ వస్తాయని చెబుతున్నారు. ఇండియాలో వాట్సప్‌కు 25 కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు. 2014 లో ఫేస్‌బుక్ కొనుగోలుతో యాడ్స్ ఫ్రీగా ఉన్న వాట్సాప్ ఇపుడు యాడ్స్‌తో వాణిజ్య పరంగా కూడా బలపడాలని చూస్తోంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *