అమెరికాలో ఇప్పటిదాకా ఆ చేపలు అమ్మలేదు...ఇపుడే ప్రభుత్వం అనుమతిచ్చింది!

అమెరికాలో ఇప్పటిదాకా ఆ చేపలు అమ్మలేదు...ఇపుడే ప్రభుత్వం అనుమతిచ్చింది!

అమెరికాలో మాంస ఆహార కొరతను తీర్చడానికి కొత్తగా సాల్మన్ చేపలను తొలిసారిగా అక్కడి ప్రజలకు అందివ్వనున్నారు. ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉన్న ఈ చేపలను ఇప్పటిదాకా అమెరికా ఇతర కారణాల వల్ల అనుమతి ఇవ్వలేదు. దీనికి పరిష్కారం కనుక్కున శాస్త్రవేత్తలు..జన్యుపరంగా చేపల్లో మార్పులు చేశారు. దీనివల్ల ఆ చేపలను తింటే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవనీ, ప్రస్తుతం ఉన్న చేపల కంటే..ఈ జన్యుపరమైన సాల్మన్ చేపలు వేగంగా పెరుగుతాయని నిరూపించారు. దీంతో అమెరికా ప్రభుత్వం సాల్మన్ చేపలను దేశంలోకి అనుమతి ఇచ్చారు. ఇండియానాలోని ఆక్వాబౌంటీ కంపెనీ కెనడా నుంచి అమెరికాకు ఈ సరికొత్త చేపలకు చెందిన గుడ్లను తీసుకొచ్చారు.

బయో ఇంజనీర్లు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుని ఈ చేపల్ని పెంచుతున్నారు. ఈ సాల్మన్ చేపలు దాదాపు 35 కేజీల బరువు కలిగి ఉంటాయి. ఈ రకం చేపలు సంపూర్ణ ఎదుగుదలకు 18 నెలల సమయం తీసుకుంటాయి. ఈ నిర్దిష్ట సమాచారాన్ని బట్టి అమెరికాలోని మర్కెట్లలోనూ, రెస్టారెంట్లలోనూ ఈ సాల్మన్ చేపలు రావాలంటే 2020 వరకు అక్కడి ప్రజలు ఆగాల్సి ఉంటుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *