'బొమ్మరిల్లు' భామ రీ ఎంట్రీ!

'బొమ్మరిల్లు' భామ రీ ఎంట్రీ!

బొమ్మరిల్లు సినిమాలో హ.. హ.. హాసిని అంటూ తెలుగు ఆడియన్స్ మెప్పించిన బ్యూటీ జెనీలియా…పెళ్ళి తరువాత సినిమాలకు ప్యాకప్ చెప్పిన ఈ అమ్మడు, ఇప్పుడు ఫేస్ కు మేకప్ వేసుకోవడానికి రెడి అవుతుంది…మరి ఈ బ్యూటీ రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా ఎంటో తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ…బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ముద్దుగుమ్మ జెనీలియా. సౌత్ లో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ తరువాత బాలీవుడ్ లోనూ సత్తా చాటింది. బాలీవుడ్ లో ఈ అమ్మడి ఫస్ట్ మూవీ హీరో రితేష్ దేశ్ముఖ్‌ను మ్యారేజ్ చేసుకున్నాక సినిమాలకు దూరమైంది. ఇక ఇద్దరు పిల్లలకు తల్లయినా, ఇప్పటికీ అదే గ్లామర్ మెయిన్ టైన్ చేస్తున్న జెనీలియా రీ ఎంట్రీతో అదరగొట్టేందుకు రెడీ అవుతోంది. పెళ్లి తరువాత రెండు హిందీ సినిమాలతో పాటు ఓ మరాఠి సినిమాలో అతిథి పాత్రల్లో నటించిన జెనీలియా త్వరలో ఫుల్ లెంగ్త్ రోల్ లో నటించేందుకు ప్లాన్ చేస్తుందట. త్వరలో ఓ మరాఠి సినిమాతో పాటు కోలీవుడ్ ,టాలీవుడ్ లో లేడి ఓరియేంటెడ్ సినిమాల్లో నటించేందుకు చేప్పిందని టాక్ వినిపిస్తుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *