విల్ స్మిత్ హీరోగా జెమినీ మాన్ ట్రైలర్ రిలీజ్

విల్ స్మిత్ హీరోగా జెమినీ మాన్ ట్రైలర్ రిలీజ్

మీలాగే ఉన్న ఇంకో మనిషిని మీరు ఎప్పుడైనా చూశారా?అతను మీరు చేయాలనుకున్న పనులని మీకన్నా ముందే చేస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది?…హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్ నటించిన ఈ జెమినీ మాన్ ట్రైలర్ చూడండి మన లాంటి మనిషే ఇంకొకరు ఉంటే ఎలా ఉంటుందో తెలుస్తుంది.

హాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన విల్‌స్మిత్‌ మెయిన్ లీడ్ ప్లే చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘జెమినిమ్యాన్’.ఆంగ్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్ అయ్యింది.చాలా కొత్త యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రంగా ఈ సినిమాలో విల్‌ స్మిత్ నే పోలి మరో వ్యక్తి ఉంటాడు.స్మిత్ చేయాలనుకున్న పనులన్నీ అతడు ముందే చేయడంతో,విల్ స్మిత్ అతన్ని ఎలా అయినా చంపాలని నిర్ణయించుకుంటాడు.అయితే స్మిత్ ఎన్నిసార్లు అతన్ని చంపడానికి ప్రయత్నించినా కూడా అతను తప్పించుకుంటూ ఉంటాడు.

అసలు ఈ జెమినిమ్యాన్‌ ఎవరు? అతను విల్ స్మిత్ లాగే ఎందుకున్నాడు? అతను ఎక్కడి నుంచి వచ్చాడు? అతనికి విల్ స్మిత్ కి ఉన్న సంబంధం ఏంటి అన్నదే జెమినీ మాన్ కథ.అక్టోబర్‌ 11న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో భారీ ఫైట్స్,స్టన్నింగ్ విజువల్స్ తో పాటు సిల్వర్ స్క్రీన్ పైన ముందెన్నడూ చూడని ఒక ఎగ్జైటింగ్ కంటెంట్ ఉందని ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *