బీజేపీలోకి గౌతమ్ గంభీర్

బీజేపీలోకి గౌతమ్ గంభీర్

బీజేపీ పార్టీ తన ఎన్నికల వ్యూహాన్ని 2014 ఎన్నికల నుంచి పూర్తీగా మార్చేసింది.ప్రజల్లో బాగా క్రేజ్ ఉన్నవారిని ప్రచారానికి ఉపయోగించడం ఇందులో మొదటిది. సినిమా వారిని,క్రికెటర్లను పార్టీకి దగ్గరగా ఉంచుకుని ప్రచారం చేయడం.ఇది ఈ ఎన్నికల్లోనూ జరిగింది.వారం క్రితం ఆంధ్రప్రదేశ్‌లో సినీనటీ మాధవీలతకు టికెట్ ఇవ్వడం ద్వారా దక్షిణ భారతదేశంలో కూడా ఈ వ్యూహాన్ని పక్కాగా అమలు చేసింది.

తాజాగా భారత క్రికెట్ ఆటగాడు,టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ బీజేపీ పార్టీలో చేరారు.కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ గంభీర్‌కి కండువా కప్పి ఆహ్వానించారు.గంభీర్ ఢిల్లీలోని ఓ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ కూడా చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సందర్భంగా గంభీర్ మాట్లాడుతూ…ప్రధాని నరేంద్ర మోదీ పాలన నచ్చి,ఆయన నాయకత్వాన్ని ఇష్టపడి బీజేపీ పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు.పార్టీలో చేరే అవకాశం ఇచ్చినందుకు ఎంతో గౌరవంగా భావిస్తున్నాని అన్నారు. గత కొంత కాలంగా గంభీర్ రాజకీయ అంశాలపై ఎప్పటికపుడు స్పందిస్తూ వస్తున్నారు. దేశానికి సంబంధించిన అంశాలపై ఎప్పటికపుడు మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు సూచనలు ఇస్తూనే ఉన్నారు. ఇపుడు ఏకంగా పార్టీలో చేరిపోయారు. పుల్వామా దాడి జరిగిన సందర్భంలొ గంభీర్‌ స్పందిస్తూ… ప్రపంచకప్‌ గేమ్‌లో టీమిండియా పాక్‌తో మ్యాచ్‌ ఆడకూడదని సూచించారు. పాకిస్తాన్‌తో ఆడకపోతే రెండు పాయింట్లు మాత్రమే పోతాయని, అమర జవాన్ల ప్రాణాలకన్నా.. క్రికెట్‌ ఎక్కువేం కాదని ఖరాఖండీగా చెప్పారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *