ఉత్కంఠను రేపుతోన్న 'గేమ్ ఓవర్' ట్రైలర్ ..

ఉత్కంఠను రేపుతోన్న 'గేమ్ ఓవర్' ట్రైలర్ ..

తెలుగు తమిళ భాషల్లో అవకాశాల పరంగా వెనుకబడిపోయిన తాప్సీ, హిందీలో అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకెళుతోంది. అక్కడ విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ ఒక్కో సినిమాతో తన క్రేజ్ ను పెంచుకుంటూ వెళుతోంది. ఈ నేపథ్యంలోనే హిందీలో గేమ్ ఓవర్ అనే హారర్ థ్రిల్లర్ సినిమా చేస్తుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ రిలీజ్ చేశారు చిత్రటీమ్ . ఆ ట్రైలర్‌పై మీరు ఓ లుక్కెయండి..అశ్విన్‌ శరవణన్‌ దర్శకత్వంలో హాట్ బ్యూటీ తాప్సి పన్ను ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా గేమ్‌ ఓవర్‌. తాజాగా రిలీజైన ట్రైలర్‌ని బట్టి చూస్తుంటే ఈ మూవీలో తాప్సి వీడియో గేమ్స్‌ను డిజైన్‌ చేసే అమ్మాయి పాత్రను పోషించినట్లు తెలుస్తోంది. తాప్సి భయంకరంగా అరుస్తున్న సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. డైలాగ్ లేకుండా వచ్చిన ట్రైలర్‌లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. సినిమా కన్పెప్ట్ ఎంటీ అనేది ట్రైలర్‌లోనే చూపించారు. జూన్‌ 14న తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ హారర్‌ గేమ్ మూవీ ఆడియన్స్‌ని ఎంతవరకు మెప్పింస్తుందో చూడాలి..

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *