పామును మింగేసిన కప్ప

పామును మింగేసిన కప్ప

పాము అంటే కప్పలకు హడల్. కప్ప కంటబడిందో మరు క్షణంలో పాము దాన్ని గుటుక్కుమనిపిస్తుంది. అది ప్రకృతి ధర్మం. కానీ ఇందుకు విరుద్ధంగా కప్పే పామును మింగేసిన వింత ఘటన కృష్ణా జిల్లాలో సంచలనం రేపింది. పాములు కప్పలను తినడం సహజం. అందుకు భిన్నంగా ఓ కప్ప పామును మింగిన అరుదైన ఘటన కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం రామన్నపేటలో చోటుచేసుకుంది. అడుగు పొడవు కూడా లేని ఓ కప్ప.. రెండడుగుల కొండచిలువను మింగేసింది. అయితే పామును మింగేంత ఖాళీ.. కప్పకు లేకపోవడంతో పాము సగభాగం బయటే ఉండిపోయంది. దీంతో సగం లోపల, సగం బయట ఉండిపోయిన కొండచిలువ గిలగిల కొట్టుకుంది. తప్పించుకునేందుకు పాము విశ్వ ప్రయత్నాలు చేసింది.అప్పటికే చాలా మంది ఈ వింతను చూసేందుకు తరలిరావడంతో.. కప్ప నీటిలోకి దూకేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ.. కప్ప సాహసాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *