స్వాతంత్ర్యం వద్దన్న ప్రజలు

స్వాతంత్ర్యం వద్దన్న ప్రజలు

పసిఫిక్‌ సముద్రంలోని న్యూ కెలడోనియా దీవుల వాసులు స్వాతంత్ర్యం కోరుకోవడంలేదు. వారందరూ ఫ్రాన్స్‌ దేశంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు.

New Caledonia independence

ఫ్రాన్స్‌తోనే ఉంటామంటూ…

అక్కడి ప్రజలు తాము ఫ్రాన్స్ లోనే ఉండాలో లేకపోతే వేరే దేశంగా మారిపోవాలా అనే అంశంపై రెఫరెండం నిర్వహించుకున్నారు. ఆ రెఫరెండంలో మొత్తం 2.69 లక్షల జనాభాలో అర్హులైన 1.75 లక్షల మంది పాల్గొన్నారు. ఫలితం మొత్తం ఓటింగ్‌లో 70 శాతం లెక్కింపు పూర్తి కాగానే వచ్చింది. అందులో 59.5 శాతం మంది స్వాతంత్య్రం వద్దు, ఫ్రాన్స్‌తోనే ఉంటామంటూ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు అధికారులు తెలిపారు.

2022లో మరోసారి…

1853లో ఫ్రాన్స్‌ వలస ప్రాంతంగా మారింది. అప్పటినుంచి అక్కడ సెటిలైన శ్వేత జాతీయులు, స్థానిక కనాక్‌ ప్రజల మధ్య వైషమ్యాలు చెలరేగాయి. 1998లో రెండు జాతుల మధ్య జరిగిన ఘర్షణల్లో 70 మంది వరకు చనిపోయారు. ఆ తర్వాతే న్యూ కెలడోనియాకు మరిన్ని అధికారాలు ఇచ్చేందుకు, రెఫరెండం నిర్వహించేందుకు ఫ్రాన్స్‌ ప్రభుత్వం అంగీకరించింది. దాని ప్రకారం స్వాతంత్య్రం కావాలా వద్దా అనే విషయంపై 2022లో మరోసారి రెఫరెండం నిర్వహించాల్సి ఉంటుంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *