స్వీపర్ పనికి పీజీ అభ్యర్థుల దరఖాస్తు!

స్వీపర్ పనికి పీజీ అభ్యర్థుల దరఖాస్తు!
ప్రభుత్వ అలసత్వం మూలంగా దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది. ఏడాదికి లక్షల మంది చదువులు పూర్తి చేసి కాలేజీల నుంచి బయటకు వస్తుంటే…ప్రభుత్వం కల్పించే ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు అన్నీ కలిపి వేలల్లోనే ఉంటున్నాయి. దీంతో ఉన్నత విద్య చదివిన వారు సైతం చిన్న చిన్న కొలువులకు దరఖాస్తు చేసుకుంటున్నారు. 

వేల పోస్టులు..లక్షల్లో అభ్యర్థులు!

దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది. లక్షలమంది యువత డిగ్రీలు, ఎంబీఏలు, బీటెక్‌లు చదివి.. ఉద్యోగాల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్‌ జారీ అయినా సరే లక్షల్లో దరఖాస్తు చేస్తున్నారు. చదివిన చదువుకు, ఉద్యొగానికి ఏమాత్రం సంబంధం ఉండటం లేదు. ఆఖరికి స్వీపర్‌ పోస్టుల కోసం కూడా వందల్లో పట్టభద్రులు అప్లై చేశారంటే.. నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సంఘటన తమిళనాడులో జరిగింది.
 
Engineers & MBAs applied for sweeper jobs
 
తమిళనాడు అసెంబ్లీ సెక్రటేరియట్‌లో స్వీపర్‌, శానిటరీ కార్మికుల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది పర్భుత్వం. ఈ పోస్టుల కోసం ఎంటెక్‌, బీటెక్‌, ఎంబీఏ, గ్రాడ్యుయేట్లు, పోస్ట్‌ గ్రాడ్యుయేట్ల నుంచి వందల దరఖాస్తులు వచ్చి పడ్డాయి. వీరితో పాటు డిప్లోమా పట్టా పొందిన వారు కూడా స్వీపర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. మొత్తం 10 స్వీపర్‌ పోస్టులు, 4 శానిటరీ కార్మికుల పోస్టులకు గత ఏడాది సెప్టెంబర్‌ 26వ తేదీన తమిళనాడు అసెంబ్లీ సెక్రటేరియట్‌ దరఖాస్తులను ఆహ్వానించింది. సంబంధిత విభాగంలో అనుభవం ఉంటే సరిపోతుందని పేర్కొంది.

సరిగా చేసుకోలేనివారు…

మళ్లీ ఇలాంటి అవకాశం రాదని నిర్ణయించుకున్న నిరుద్యోగుల నుంచి… ఎంప్లాయిమెంట్‌ ఎక్సైంజ్‌తో సహా మొత్తం 4,607 దరఖాస్తులు అందాయి. వీరిలో డిగ్రీలు, ఎంబీఏలు, బీటెక్‌లు పూర్తీ చేసినవారు కూడా ఉన్నారు. ఇలా వచ్చిన దరఖాస్తుల్లో సరైన వివరాలు నమోదు చేయకపోవడంతో దాదాపు 677 మంది దరఖాస్తులను సంబంధిత అధికారులు తిరస్కరించారు. స్వీపర్ ఉద్యోగాలకు కూడా డిగ్రీలు, పీజీలు చదివిన వారు అప్లై చేయడంతో… అధికారులు సైతం షాక్ అయ్యారు.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *