ఒడిశాలో భీకర ఎన్ కౌంటర్

ఒడిశాలో భీకర ఎన్ కౌంటర్

అరకు ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే శివేరి హత్యకేసులో కీలక నిందితురాలు స్వరూప హతమైంది. ఒడిశాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆమె మృతి చెందింది. కిడారి, సోముల హత్య జరిగిన నాటి నుంచి ఏవోబీలోని అడవులను పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలోనే తాజా ఎన్‌కౌంటర్‌లో స్వరూప సహా మరో నలుగురిని హతమార్చారు.

తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోము హత్యకేసులో కీలక నిందితురాలు స్వరూప హతమైంది. ఒడిశాలోని కోరాపుట్ జిల్లా పాడువా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆమె మృతిచెందింది. కిటుబకంటి అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న భద్రతాదళాలకు మావోయిస్టుల తారసపడ్డారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. ఇందులో స్వరూప చనిపోయినట్లు పోలీసులు ప్రకటించారు.

గత ఏడాది సెప్టెంబర్ 23న కిడారి సర్వేశ్వరావు, శివేరి సోములను మావోయిస్టులు హత్యచేశారు. పాయింట్ బ్లాంక్‌ రేంజ్‌లో వారిని కాల్చి చంపారు. అరకు పరిధిలోని లివిటిపుట్ట సమీపంలో జరిగిన ఈ ఘటన..తెలుగు రాష్ట్రాల్లో అప్పట్లో సంచలనం రేపింది. నాటి హత్యాకాండలో పాల్గొన్న మావోయిస్టులలో భీమవరానికి చెందిన కామేశ్వరి అలియాస్‌ స్వరూప, అలియాస్‌ సింద్రి, అలియాస్‌ చంద్రి, అలియాస్‌ రింకీ ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *