ఆసీస్‌తో తొలి టీ20 ఆడనున్న భారత్

ఆసీస్‌తో తొలి టీ20 ఆడనున్న భారత్
వరుస విజయాలతో దూకుడు మీదున్న భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో తొలి టీ20 ఆడనుంది. ప్రపంచకప్‌కు ముందు జరిగే చివరి సిరీస్ కావడంతో భారత ఆటగాళ్లు తమ సత్తా చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఎదురుచూస్తున్నారు. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌కి రెస్ట్ తీసుకున్న విరాట్ కొహ్లీ, లేటెస్ట్ సెన్సేషన్ జస్‌ప్రీత్ బుమ్రా మళ్లీ జట్టులో చేరారు. వెన్నునొప్పి గాయంతో ఇబ్బంది పడుతున్న హార్దిక్ పాండ్య స్థానంలో రవీంద్ర జడేజా ఆడనున్నాడు. భువనేశ్వర్, కుల్దీప్‌లను ఈ సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకోనున్నారు.

భారత జట్టుకు వైజాగ్ స్టేడియం ఎంతో కలిసొచ్చింది. ఈ స్టేడియంలో ఆడిన 10 మ్యాచుల్లో 8 మ్యాచ్‌లను గెలుచుకుంది. పైగా స్వదేశంలో ఆడిన చివరి ఏడు టీ20ల్లో విజయ దుంధుభి మోగించింది. విశాఖపట్నం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు ఇప్పటికే వైజాగ్ చేరుకున్నాయి. రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *