72 మంది ఓసీలు, 31 మంది బీసీలు 126 మందితో టీడీపీ తొలి జాబితా

72 మంది ఓసీలు, 31 మంది బీసీలు 126 మందితో టీడీపీ తొలి జాబితా

టీడీసీ తొలి జాబితాను రిలీజ్‌ చేసింది. ఫస్ట్‌ లిస్ట్‌లో 126 మందికి చోటు కల్పించింది. మిగతా స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. మిషన్ 150 ప్లస్‌ను టార్గెట్‌గా పెట్టుకుని జాబితాను తయారు చేసినట్టు చంద్రబాబు చెప్పారు.

ముందు నుంచి మోజో టీవీ చెప్పిందే నిజమైంది. అసెంబ్లీ బరిలో నిలిచే అభ్యర్థుల తొలిజాబితాను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. 126 మందితో కూడిన ఫస్ట్‌ లిస్ట్‌ను చంద్రబాబు రిలీజ్‌ చేశారు. స్థానిక మెజార్టీ నేతలు, కార్యకర్తల అభిప్రాయం, సర్వేల ఆధారంగా అభ్యర్థుల్ని ఖరారు చేశారు. అంతేకాదు సిట్టింగ్‌లకు అధిక ప్రాధాన్యతనిచ్చినిచ్చారు చంద్రబాబు.

టీడీపీ తొలిజాబితాలో సామాజిక సమీకరణాలను పరిశీలిస్తే.. 72 మంది ఓసీలు, 31 మంది బీసీలు, 17 ఎస్సీ, 4గురు ఎస్టీ, ఇద్దరు మైనార్టీ అభ్యర్థులకు చంద్రబాబు టికెట్లు కేటాయించారు.

మిగిలిన పేర్లను మరో రెండు మూడు రోజుల్లో ప్రకటిస్తామని చంద్రబాబు చెప్పారు. అలాగే, ఎంపీ అభ్యర్థుల పేర్లను రెండు రోజుల్లో ప్రకటిస్తామన్నారు. ఎమ్మెల్యే టికెట్ రాని వారికి ప్రభుత్వం వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులు ఇస్తామన్నారు చంద్రబాబు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *