ప్లాస్టిక్‌ కంపెనీలో అగ్ని ప్రమాదం

ప్లాస్టిక్‌ కంపెనీలో అగ్ని ప్రమాదం

రాజేంద్రనగర్ మండలం లోని కటేదాన్ పరిశ్రమిక వాడాలో రాజు అనే వ్యక్తి ప్లాస్టిక్ కంపెనీ నడుపుతున్నడు.ఈ రోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో కంపెనీలో అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. జన నివాసాల మధ్య ఈ కంపెనీ ఉండడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి కూడా చాలా కష్టపడ్డారు. దట్టమైన పొగ ఈ ప్రాంతాన్ని అలుముకుంది సమాచారం అందుకున్న మైలార్ దేవ్ పల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఫైర్ సిబ్బంది సహాయంతో మంటలను ఆర్పారు. జన నివాసాల మధ్య ఇలాంటి కంపెనీలు నడుపుతున్నారు వీటి పైన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో తేలుతూ చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా పర్మిషన్ లేకుండా నడుపుతున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సుమారు 10 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చు అన్ని పోలీసులు భావిస్తున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *