నో గ్లామర్... ఓన్లీ ఎలక్షన్..!

నో గ్లామర్... ఓన్లీ ఎలక్షన్..!

ఎన్నికలంటే సందడి…ఎన్నికలంటే పండుగ…ఎన్నికలంటే హడావుడి…ఎన్నికలంటే సినీతారల సందడి.ఏ ఎన్నికలైన తెలుగు రాష్ట్రాలలో ఇదే వాతవరణం ఉంటుంది.సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో మహానటుడు ఎన్ టీ రామారావు తెలుగు దేశం పార్టీ పెట్టినప్పటి నుంచీ రాజకీయాలకు సినీగ్లామర్ తోడైంది.అప్పటి వరకూ ఎన్నికల ప్రచారానికి ఏ నటుడూ,ఏ నటీ వచ్చేవారు కాదు.తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఒక్కొక్కరుగా నటీనటులు ప్రచారానికి ఊళ్లలోకి రావడం ప్రారంభించారు.కొందరు నటీనటులైతే రాజకీయరంగ ప్రవేశం చేసి తమ ఆప్తులైన తోటి నటులను ప్రచారానికి తీసుకువచ్చేవారు.దీంతో వెండితెరపై కదలాడిన హీరో హీరోయిన్లు తమ కళ్ల ముందే ప్రత్యక్షమవ్వడంతో ఓటర్లుకూడా ప్రభావితం అయ్యేవారు.కొందరు నటీనటులు వివిధ రాజకీయ పార్టీల నుంచి ఎన్నికల బరిలోకి దిగడంతో ఆ నియోజక వర్గాలు సినీ గ్లామర్‌తో కళకళలాడిపోయేవి.ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో జరుగుతున్న ఎన్నికల్లో మాత్రం సినీ గ్లామర్ మచ్చుకైన కనిపించడం లేదు.

పోటీ సరే.. ప్రచారానికి రారేం..!
వెండితెర వేల్పులు కొందరు ఈసారి ఎన్నికలలో పోటీ చేస్తున్నారు.ముఖ్యంగా మెగా స్టార్ కుటుంబం నుంచి ఇద్దరు అన్నదమ్ములు పవన్ కల్యాణ్,నాగబాబు ఎన్నికల బరిలో ఉన్నారు.పోలింగ్ సమయం దగ్గర పడుతున్నా వారిద్దరి తరఫున ప్రచారం చేసేందుకు మెగా కుటుంబం నుంచి ఎవరూ రావడం లేదు.తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతున్న సినీ రంగ ప్రముఖులూ ఆ పార్టీ తరఫున ప్రచారానికి వెళ్లలేదు.ప్రముఖ హీరో బాలక్రిష్ణ హిందూపురం నుంచి పోటీ చేస్తున్నా ఆయన తరఫున ప్రచారం చేసేందుకు జూ.ఎన్టీఆర్,కల్యాణ్ రామ్‌లు కదల్లేదు.ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో హేమాహేమీలైన మోహన్ బాబు,జయసుధ,జీవిత,రాజశేఖర్,ఆలీ,పోసాని, ప్రుధ్వి వంటివారు చేరారు.వారూ వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున ఎక్కడా ప్రచారం చేయడం లేదు.ఇక భారతీయ జనతాపార్టీ నాయకుడైన అలనాటి హీరో క్రిష్ణంరాజు ప్రధాని నరేంద్ర మోదీ సభలకు హజారవుతున్నారు తప్ప ప్రచారం జోలికి వెళ్లడం లేదు.దీంతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ,లోక్‌సభ,తెలంగాణ లో జరుగుతున్న లోక్ సభ ఎన్నికలు “నో సినీ గ్లామర్… ఓన్లీ ఎలక్షన్”అన్నట్లు గానే ఉన్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *