కన్నకూతురిని కడతేర్చిన కసాయి తండ్రి

కన్నకూతురిని కడతేర్చిన కసాయి తండ్రి

భర్తను వదిలేసి ఇంట్లో ఉంటూ తనను ఇబ్బందులకు గురిచేస్తుందని కన్నకూతురినే తండ్రి రొకలిబండతో కొట్టి చంపిన ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్ గ్రామానికి చెందిన శ్యామలకు ఐదేళ్ల క్రితం కోడేరు మండల కేంద్రానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. అయితే కుటుంబ కలహాల కారణంగా భర్త నుంచి విడిపోయిన శ్యామల రెండేళ్లుగా పుట్టినింట్లోనే ఉంటుంది. మొదట్లో కూతురు తండ్రితో బాగానే ఉన్నా కొన్ని రోజుల నుంచి ఉన్నదానికి లేనిదానికి ఇంట్లో గొడవలు పడుతూ వస్తుంది. భర్త లేకపోవడంతో కన్నబిడ్డ పోషణ ఎలాగంటూ మనస్థాపానికి గురై గొడవ చేస్తుందని సర్దుకుంటూ పోయాడు తండ్రి. ఇంట్లో గొడవలు రోజురోజుకు ఎక్కువ కావడంతో కన్న కూతురిపైనే విసుకు తెచ్చుకున్నాడు. ఎలాగైనా బిడ్డను వదిలించుకోవాలనుకునన తండ్రి కూతురుతో గొడవకు దిగారు. ఆవేశంతో ఊగిపోయిన తండ్రి రోకలి బండతో కూతురి తలపై మోది చంపాడు. ఆశ్రయం కోసం తండ్రిని కూతురు ఆశ్రయిస్తే తండ్రే కూతురిని చంపడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *