మళ్లీ రగిలిన పోడుభూముల పోరు

మళ్లీ రగిలిన పోడుభూముల పోరు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కుదునూరు గ్రామంలో పోడు భూమి వివాదంలో రాఘవయ్య అనే గిరిజనుడు దారుణ హత్యకు గురయ్యాడు,రాడ్లు, కర్రలతో విచక్షణ రహితంగా ప్రత్యర్థి వర్గాలు విరుచుకుపడ్డారు.ఆదివారం రాత్రి కుదునూరు పంచాయతీ లోని బోటి గూడెం కు చెందిన బూటారీ రాఘవయ్య కుదునూరు నుండి ఆటోలో వెళుతు0డగా, అప్పటికే అతని పై కాపు కాసిన కొంతమంది వ్యక్తులు ఆటోలో వెళుతున్న రాఘవయ్య పై రాడ్లు, కర్రలతో దాడి చేసి హత్య చేశారు. ఘటనలో ఉన్న మరో యువకుడిని కూడా తీవ్రంగా గాయ పరిచారు.అక్కడ ఉన్నవారు తేరుకునే లోపు రాఘవయ్య ను దారుణంగా హత్య చేయబడ్డాడు,ఈఘటన తో ఏజెన్సీ గ్రామాలు ఉలిక్కిపడ్డాయి. కుదునూరు ప్రాంతంలో సుమారు 60 ఎకరాల్లో గత కొంతకాలంగా గిరిజనులు,హరిజనులు పోడు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే ఇప్పుడు అదే ప్రాంతానికి చెందిన హరిజన కాలనీ వారు అదే 60 ఎకరాల్లో పోడు చేస్తున్నారు. దీనితో ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తింది.దీనితో అధికారులు కలగచేసుకుని ఇరువర్గాల వారిని వారించి పోడు భూముల కు సంబంధించి ఎవరూ వ్యవసాయం చేయరాదని సూచించారు. దీనితో గిరిజనులు తమకు ఉన్న ఆధార పత్రాలతో కోర్టు ను ఆశ్రయించారు. కోర్టు ఉత్తర్వులు ప్రకారం స్టే వచ్చింది.ఇదంతా రాఘవయ్య కావాలనే తమను పోడు భూముల్లోకి రానివ్వకుండా చేస్తున్నాడని ఆగ్రహంతో రాత్రి రాడ్లు కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఘటనలో దాదాపు 20 మంది హరిజన కాలనీ వాసులు ఈ ఘటన లో ఉన్నట్లు రాఘవయ్య బంధువులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్నీ పోస్ట్ మార్టం నిమిత్తం భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ కు తరలించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *