ఎకరాకు 54 బస్తాల దిగుబడి సాధించిన రైతు

ఎకరాకు 54 బస్తాల దిగుబడి సాధించిన రైతు

రైతు పండించిన పంటలో చేతికొస్తే సంబరపడతాడు. అదే పంట లాభాలను తెస్తే ఆ సీజన్ మొత్తం పండగలా గడుపుతాడు. కానీ, అదే పంట ఆశించిన దానికంటే ఎక్కువ ధాన్యాన్ని ఇస్తే ఇక అతని ఆనందానికి తిరుగుండదు. అలాంటి ఆనందాన్నే అనుభవిస్తున్నాడు పూర్ణప్రసాద్ అనే రైతు. సహజంగా కొందరు రైతులు సంప్రదాయ వరి విత్తనాలతో పంటను పండిస్తుంటారు. వేరే వాటిని వాడటానికి చాలావరకు జంకుతారు. కానీ పూర్ణ ప్రసాద్ మాత్రం సంప్రదాయ విత్తనాలకు బదులు మార్టేరు వ్యవసాయ పరిశోధన క్షేత్రానికి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఎంటీయూ-1262 అనే రకం విత్తనంతో పంట వేశాడు. దీని ద్వారా 54 బస్తాల దిగుబడి సాధించి అందరినీ ఆశ్చర్య పరిచాడు. వ్యవసాయశాఖ అధికారులు నిర్వహించిన పంటకోత ప్రయోగంలో ఈ రికార్డు నమోదు అయింది.

రైతుకి సత్కారం!

అద్భుతమైన ఈ దిగుబడి గురించి…సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ విధానాల్ని పాటించినందున ఇంత దిగుబడి వచ్చిందని పూర్ణప్రసాద్ చెప్పారు. సంప్రదాయ వంగడాలను సాగుచేస్తే చీడ వల్ల దిగుబడి తగ్గేదని అన్నారు. ఈ సందర్భంగా తూర్పు డెల్టా ప్రాజెక్ట్ కమిటీ ఛైర్మన్ గుత్తా శివరామకృష్ణ పంటకోత జరిగే సమయంలో ఉండి రైతుని అభినందించారు. ఈ కార్యక్రమంలో గుడివాడ డివిజన్ వ్యవసాయశాఖ సహాయ సంచాలకుడు శ్రీనివాసులు, వ్యవసాయ విస్తరణాధికారు అపర్ణ ఆదర్శ రైతు పూర్ణప్రసాద్‌ను సత్కరించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *