ఎన్నికల బరిలో కుటుంబసభ్యులు

ఎన్నికల బరిలో కుటుంబసభ్యులు

ఎన్నికల్లో కుల రాజకీయాలతో పాటు..కుటుంబ రాజకీయాలు కూడా ఓ రేంజ్‌లో కొనసాగుతున్నాయి.టీడీపీ పార్టీలో భారీగా బంధువర్గం ఎన్నికల బరిలో దిగనుంది.ఈ ఎన్నికల్లో ఏకంగా 34 మంది పార్టీ నాయకులతో దగ్గరి బంధుత్వమున్న వారు పోటీ చేయనున్నారు.

టీడీపీ నేతల దగ్గరి బంధువులు ప్రచారంలో బిజిబీజీగా ఉన్నారు.కుటుంబ సభ్యులు ఎన్నికల బరిలో ఉండటంతో ఆయా కుటుంబాల ప్రచారంతో క్యాంపెయినింగ్‌లో సందడి వాతావరణం నెలకొంది.ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు బంధువులు నలుగురు ఈ ఎన్నికల బరిలో దిగనున్నారు.అధినేత చంద్రబాబు,బాలకృష్ణ మధ్య బంధం కాస్త వియ్యంకుల అనుబంధంగా మారింది.కుప్పం నియోజకవర్గం నుంచి చంద్రబాబు ఏడవసారి బరిలోకి దిగుతుండగా..బాలకృష్ణ హిందూపురం నుంచి రెండోసారి పోటీ చేస్తున్నారు.చంద్రబాబు కుమారుడు, బాలకృష్ణ పెద్ద అల్లుడు లోకేష్‌ మంగళగిరినుంచి తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలో ఉండగా…రెండో అల్లుడు దివంగత నేత ఎంవీవీఎస్‌ మూర్తి మనవడు భరత్‌ విశాఖ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.ఇటు శ్రీకాకుళం జిల్లాలోనూ బాబాయి, అబ్బాయిలు పోటీ చేస్తున్నారు.అచ్చెన్నాయడు టెక్కలి నుంచి పోటీ చేస్తుండగా..రామ్మోహన్‌ నాయుడు మళ్లీ శ్రీకాకుళం ఎంపీగా పోటీలో ఉన్నారు.రామ్మోహన్‌నాయుడు సోదరి ఆదిరెడ్డి భవాని రాజమండ్రి అర్బన్‌ నుంచి..ఆయన మామయ్య బండారు సత్యనారాయణమూర్తి పెందుర్తి నుంచి పోటీ చేస్తున్నారు.గంటా శ్రీనివాసరావు, నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ మంత్రులయిన తరువాత వియ్యంకులుగా మారారు. 2014 ఎన్నికల ముందు కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరారు.గంటా విశాఖ నార్త్ నుంచి,నారాయణ నెల్లూరు అర్బన్‌ నుంచి బరిలోకి దిగనున్నారు.గంటా మరో వియ్యంకుడు రామాంజనేయులు భీమవరం నుంచి పోటీ చేస్తున్నారు.ఆర్దిక మంత్రి యనమల రామకృష్ణుడి వియ్యంకుడు,టీటీడీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్ గత ఎన్నికల్లో మైదుకూరు నుంచి పోటీ చేశారు.

విజయనగరం నుంచి ఎంపీ అశోక్‌గజపతిరాజు పోటీ చేస్తుంటే,ఆయన కుమార్తె అదితి విజయనగరం అసెంబ్లీకి పోటీచేయనున్నారు.చీపురుపల్లి నుంచి పోటీ చేస్తున్న కిమిడి నాగార్జున ఎచ్చర్ల నుంచి పోటీ చేస్తున్న కళా వెంకట్రావుకు పెదనాన్న.అరకు అభ్యర్థి కిడారిశ్రావణ్‌్‌కి,పాడేరు అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పెద్దమ్మ. గుడివాడ నుంచి పోటీ చేస్తున్న దేవినేని అవినాష్‌కు మైలవరం నుంచి పోటీ చేస్తున్న మంత్రి దేవినేని ఉమ బాబాయి అవుతారు.గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు,కొమ్మలపాటి శ్రీధర్ 2014 ఎన్నికల తరువాత వియ్యంకులుగా బంధాన్ని ఏర్పరచుకున్నారు.అనంతపురం ఎంపీగా పోటీ చేస్తున్న జేసీ పవన్, తాడిపత్రి నుంచి పోటీ చేస్తున్న అస్మిత్ రెడ్డి సోదరులు.అన్నదమ్ముల సంతానమైన కేఈ శ్యామ్‌ పత్తికొండ నుంచి,కేఈ ప్రతాప్‌ డోన్‌ నుంచి బరిలో ఉండనున్నారు. అన్నదమ్ములల పిల్లలైన భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డనుంచి,బ్రహ్మానందరెడ్డి నంద్యాల నుంచి పోటీ చేస్తున్నారు.నంద్యాల ఎంపీ శివానందరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరితా రెడ్డి అన్నా చెల్లెళ్లు.కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి కర్నూలు ఎంపీ గానూ,ఆయన భార్య సుజాతమ్మ ఆలేరు ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు.ఒక బావ మరదళ్లైన అమర్‌నాథ్‌ రెడ్డి పలమనేరు నుంచి అనూషారెడ్డి పుంగనూరు నుంచి పోటీ చేయనున్నారు.వీరే కాకుండా…రాజమండ్రి అర్బన్‌ నుంచి రామ్మోహన్‌నాయుడు సోదరి భవాని పోటీలో ఉన్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *