రిలీజైన ఫలక్ నుమా దాస్ ట్రైలర్

రిలీజైన ఫలక్ నుమా దాస్ ట్రైలర్

హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‌లో పక్క మాస్ ఎంటర్‌టైనర్‌ కంటెంట్‌తో తెరకెక్కుతున్న సినిమా ఫలక్ నుమా దాస్. ఆ మధ్య రిలీజైన ఈ మూవీ టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇక ఈ సినిమాని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థతో పాటు మూడు బ్యానర్లు రూపొందిస్తుండటంతో ట్రేడ్ వర్గాల్లో కూడా మంచి ఎక్స్ పెటేషన్స్ ఉన్నాయి. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్..ట్రైలర్ చాలా బోల్డ్ ఉంది. గ్యాంగ్ వార్స్ ని చిత్రీకరించిన తీరుతో పాటు బస్తీ జీవితాన్ని చాలా న్యాచురల్‌గా చూపించారు.. ఈ సినిమాలో ఉత్తేజ, తరుణ్ భాస్కర్ తప్ప మిగత వాళ్లంత కొత్తవాళ్లే కనిపిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఈ సినిమా క్రైమ్ స్టోరీస్ ని ఇష్టపడే వాళ్లకు కనెక్ట్ అయ్యేలా ఉంది. మరి ట్రైలర్‌తో ఆడియన్స్ ఆకట్టుకుంటున్న ఈ చిత్రం రిలీజ్ తరువాత ఎలా మెప్పిస్తుందో చూడాలి మరి…

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *