ప్లాప్ డైరెక్టర్‌కు నాని ఛాన్స్ ఇస్తాడా ?

ప్లాప్ డైరెక్టర్‌కు నాని ఛాన్స్ ఇస్తాడా ?

అల్లు అర్జున్ కెరీర్ లోనే భారీ బడ్జట్ తో తెరకెక్కిన సినిమా నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. సైనికుడిగా కనిపించిన బన్నీ యాక్టింగ్ కి మంచి మార్కులు పడ్డాయి కానీ… బాక్సాఫీస్ దగ్గర ఆ మూవీ బొక్కబోర్ల పడింది. నా సూర్య సినిమాతో దర్శకుడిగా మారిన వక్కంతం వంశీ… భారీ అంచనాలైతే సృష్టించాడు కానీ వాటిని నిలిబెట్టుకోలేక పోయాడు. ముఖ్యంగా నా పేరు సూర్య కథలోనే దమ్ము లేకపోవడం, కథనం పేలవంగా సాగడం ఆ సినిమా ఫెయిల్యూర్ కి ముఖ్య కారణాలు. దీంతో దర్శకుడిగా సెటిల్ అవాలనుకున్న వక్కంతం వంశీ ఆశలు ఆవిరైపోయాయి.

ఈ సినిమా విడుదలై ఏడాది దాటినా కూడా వక్కంతం వంశీకి దర్శకుడిగా మరో అవకాశం… చాలా కాలంగా అజ్ఞాతంలో ఉన్న వంశీ, నాచురల్ స్టార్ నాని కోసం మంచి కథని సిద్ధం చేశాడని… ఈ మధ్యే ఆ నానికి కథను వినిపించాడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. కథని విన్న నాని నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని, అతను ఓకే అంటే త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది కానీ… బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఇచ్చిన నాని, ఇప్పుడిప్పుడే జెర్సీ మూవీతో కోలుకున్నాడు. మళ్లీ డేర్ చేసి ఫ్లాప్ డైరెక్టర్ తో సినిమా చేస్తాడా అంటే కష్టమనే చెప్పాలి. వక్కంతం వంశీ రాసుకున్న కథ ఎంతో బలంగా, కొత్తగా అనిపిస్తే తప్ప నాని ఓకే చెప్పాడు, వక్కంతం మాత్రం నాని గ్రీన్ సిగ్నల్ ఇస్తాడని కాన్ఫిడెంట్ గా ఉన్నాడట. మరి ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ తర్వాత నాని, వక్కంతం వంశీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా లేదా అనేది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *