ఫేస్‌బుక్ నుంచి వాట్సాప్‌తో చాట్!

ఫేస్‌బుక్ నుంచి వాట్సాప్‌తో చాట్!
సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లను విరివిగా వాడే వారికి ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ మూడూ అకౌంట్లు ఉంటాయి. అయితే, ఇందులోని స్నేహితులు వేరు వేరు వ్యక్తులు ఉండొచ్చు..లేదంటే అనుసంధానంగా కూడా ఉండొచ్చు. కానీ వీటిని ఉపయోగించడానికి ప్రస్తుతం మూడు వేరు వేరు యాప్స్ ఉన్నాయి. 
అయితే వినియోగదారుల సౌకర్యార్థం ఈ మూడు యాప్స్‌ని కలుపుతూ…ఫేస్‌బుక్ నుంచి వాట్సాప్‌కు మెసేజ్ చేసే వెసులుబాటు కల్పించనున్నట్టు ఫేస్‌బుక్ యాజమాన్యం తెలిపింది. అదెలా కుదురుతుంది అనే డౌట్ వస్తోందా? ఏమో…టెక్నాలజీ పెరిగిన దాన్నిబట్టి ఇది వీలవ్వొచ్చు. 
 
Facebook merge WhatsApp,

అనేక ప్రశ్నలు ముందున్నాయి…

ఈ మూడు ఫ్లాట్‌ఫామ్‌లను కలిపి ఒకదాని నుంచి మరోదానికి మేసేజ్ చేసుకునేందుకు సులభ రీతిన అనుసంధానం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇలా మూడింటిని అనుసంధానం చేయడం వల్ల ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా? యూజర్ల గోప్యత విషయమై సమస్యలు ఉంటాయా? లాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతుండటం వల్ల ఈ కోణాల్లో పరిశోధన కొన్సాగిస్తున్నారు. ఇవి గనక విజయవంతమైతే ఫేస్‌బుక్ నుంచి వాట్సాప్‌కు మేసేజ్ చేసుకోవడం సులభమవుతుందని చెబుతున్నారు. ఈ ఏడాదిలోపు లేదంటే 2020 కల్లా ఈ సేవలు ప్రారంభించనున్నట్టు యాజమాన్యం చెబుతోంది. 
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *