'F2' మూవీ రివ్యూ

'F2' మూవీ రివ్యూ

సోలో  హిట్ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్న వెంకటేష్, రీసెంట్ టైమ్స్ లో మెగా ఫ్యామిలీ నుంచి ప్రామిసింగ్ మూవీస్ చేస్తున్న వార్న్ తేజ్ కలిసి, ఒక సినిమా సినిమా చేస్తున్నారనగగానే మంచి సినిమా చూడబోతున్నామనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో కలిగింది. ప్రమోషనల్ కంటెంట్ అంతా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ‘ఎఫ్ 2’ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి… కానీ సంక్రాంతి రేస్ లో పెద్ద సినిమాల విడుదల ఉండడంతో వెంకీ-వరుణ్ ఏ మేరకు ఆకట్టుకుంటారో, పెద్ద పోటీని తట్టుకొని నిలబడతారో లేదో అనే సందేహం అందరిలోనూ కలిగి ఉంటుంది. మరి ఈ అనుమానాలని దాటి సంక్రాంతి రేస్ లో చివరగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఎఫ్ 2 సినిమా ఎలా ఉందొ చూద్దాం.

పెళ్లాన్ని కంట్రోల్

 వెంకీ ఒక లోకల్ ఎమ్మెల్యే దగ్గర పీఏగా వర్క్ చేస్తూ ఉంటాడు, అమ్మా నాన్న లేని వెంకీ మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని హారికకి మ్యారేజ్ చేసుకుంటాడు. మగాడనే ఈగో ఎక్కువ ఉన్న వెంకీకి పెళ్లి కొత్తలో ఉండే సరదా,  నెమ్మదిగా భారంగా మారుతుంది, అతని ఫన్ కాస్తా ఫ్రస్ట్రేషన్ గా మారుతుంది,  దీంతో ఏం చేయాలో అర్ధం కానీ వెంకీ పెళ్లాన్ని కంట్రోల్ లో లో పెట్టుకోవాలనుకుంటాడు. ఇదే సమయంలో హారికకి హానీ అనే చెల్లి ఉంటుంది,  తింగరి తనానికి పరాకాష్ట అయిన హానీ… వరుణ్ ప్రేమలో ఉంటుంది. వరుణ్ ఏమో ఒక రఫ్ గా ఉండే ఒక బోరబండ కుర్రాడు. ప్రేమ మొదట్లో బాగానే ఉన్న హానీ, హారికా… అండ్ ఫ్యామిలీ దెబ్బకి వరుణ్ కూడా చుక్కలు కనిపిస్తాయి… ఈ సమయంలో తోడల్లుళ్లు అయిన వెంకీ వరుణ్ లు కలిసి రెండు పెళ్లిళ్లు చేసుకున్న ఎదురింటోది సలహాతో యూరోప్ వెళ్లిపోతారు. అయితే సరిగ్గా వరుణ్, హనీ పెళ్ళికి ముందు రోజు ఇలా జరగడంతో అప్సెట్ అయిన హనీ, హరికలు కలిసి వెంకీ వరుణ్ లపై రివెంజ్ తీర్చుకున్నారా? వెంకీ వరుణ్ లని దారిలో పెట్టి మళ్లీ ఇంటికి తెచ్చుకున్నారా లేదా అనేదే ఎఫ్ 2 కథా కథనం.

f2 movie review

ఫస్ట్ హాఫ్ లో

వెంకీ పాత్రలోనే కనిపించిన విక్టరీ వెంకటేష్ తనలో కామెడీ టైమింగ్ ఎక్కడా తగ్గలేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు, సరైన కథ తగిలితే ఒక  నిలబెట్టే సత్తా తనలో ఇంకా ఉందని నిరూపించిన వెంకటేష్, ఫస్ట్ హాఫ్ అంతా ముందుండి నడిపించాడు. సినిమా భారాన్ని మోసిన వెంకటేష్, కామెడీని చాలా ఈజీగా పండించాడు. వరుణ్ తేజ్ కూడా బాగా నవ్వించాడు, వెంకీతో పోల్చలేము కానీ.. వరుణ్ తన బెస్ట్ ఇచ్చాడు. తెలంగాణ స్లాంగ్ లో వెంకీతో కలిసి బాగానే నవ్వించాడు. అతని ఫ్రెండ్ పాత్రలో కనిపించిన ప్రియదర్శి కనిపించనంత సేపు అలరించాడు. ఇక హీరోయిన్స్ ఇద్దరు తమ పాత్రలకి పూర్తిగా న్యాయం చేశారు. ముఖ్యంగా తమన్నా అందంగా కనిపిస్తూనే యాక్టింగ్ డాన్స్ బాగా చేసింది. మరో హీరోయిన్ మెహ్రీన్ కూడా పర్వాలేదనిపించింది. తనకి కామెడీ పెద్దగా అలవాటు లేకపోయినా మిగిలిన వాళ్లు బాగా చేయడంతో, మెహ్రీన్ లోపం కనిపించలేదు. కామెడీ కింగ్ అయిన రాజేంద్ర ప్రసాద్ చాలా బాగా నవ్వించి, తన పాత్రకి పూర్తిగా న్యాయం చేశాడు. హనీ, హరికల ఫ్యామిలీ మెంబర్స్, వరుణ్ ఫ్యామిలీ ఫస్ట్ హాఫ్ లో బాగానే నవ్వించారు.

f2 movie review

క్లైమాక్స్

సెకండ్ హాఫ్ లో కథ యూరోప్ షిఫ్ట్ అయ్యింది, ఇక్కడ పాత గుండమ్మ కథని ఇన్స్పిరేషన్ గా తీసుకొని కుటుంబాన్నినడిపిస్తున్న ప్రకాష్ రాజ్ అండ్ ఫ్యామిలీ ఉంటుంది, మెయిన్ లీడ్స్ అందరూ ఒక కారణంతో ఆ కుటుంబంతో కలవడంతో సినిమా అంతా ఆ ఇంట్లోనే సాగుతుంది. ఎలాంటి పాత్రైనా చాలా ఈజీగా చేసే ప్రకాష్ రాజ్ మరోసారి బాగా నటించి మెప్పించాడు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి, మిగిలిన ఆర్టిస్టులు అందరూ తమ పాత్రల మేరకు నటించారు. ఇక క్లైమాక్స్ లో చిన్న క్యామియో ప్లే చేసిన వెన్నల కిశోర్, అనసూయ కూడా పర్వాలేదనపించారు. నిజానికి వెన్నెల కిషోర్ పాత్ర కథకి అవసరం లేకపోయినా కూడా క్లైమాక్స్ కోసం లీడ్ కావాలి కాబట్టి అతన్ని తీసుకున్నారు. ఇండియన్ ఎంబిఎస్సి ఆఫీసర్ గా కనిపించిన నాజర్ ది చిన్న పాత్రే అయినా కీ రోల్ కావడంతో సినిమా టువార్డ్స్ క్లైమాక్స్ వెళ్లే సమయంలో చాలా హెల్ప్ అయ్యాడు. ఇలా ఆర్టిస్టులు, లీడ్ క్యారెక్టర్లు అందరు తమ రోల్స్ లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు.

f2 movie review

సీక్వెల్ కూడా

ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే మ్యూజిక్ పర్వాలేదు, రెండు సాంగ్స్ బాగున్నాయి. రెచ్చిపోదాం బ్రదర్ పాట ఉత్సాహాన్ని ఇస్తుంది. ఫారిన్ లొకేషన్ లో షూటింగ్ కాబట్టి సినిమా రిచ్ గా కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. కుటుంబ కథా చిత్రాలకి కేరాఫ్ అడ్రస్ అయిన దిల్ రాజుకి గత కొంత కాలంగా ఉన్న బ్యాడ్ టైంని ఎఫ్ 2 సినిమా తీర్చేసింది. ఇక చివరిగా చెప్పుకోవాల్సింది డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించే,  స్టార్టింగ్ నుంచీ ఎలాంటి నేపధ్యం ఉన్న కథని తీసుకున్నా కూడా ఫన్ ఫ్యాక్టర్ ఉండేలా చూసుకుంటున్న అనిల్, ఈసారి కంప్లీట్ కామెడీ కథనే ఎంచుకున్నాడు. పెళ్ళైన కొత్తలో ఉండే సమస్యలకి తన మార్క్ కామెడీని జోడిస్తూ రాసుకున్న కథనం బాగుంది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ చాలా హిలేరియస్ గా ఉంది, సెకండ్ హాఫ్ ఏం జరగబోతుందో ముందే తెలిసిపోతుంది కాబట్టి అంత నవ్వు తెప్పించకపోయినా కూడా ఉన్నంతలో అనిల్ బాగానే మెప్పించాడు. హనీ పెళ్లికి వరుణ్ చేసిన పని ఒకటి, భర్తలకు బుద్ది చెప్పాలనే ఉద్దేశంతో స్విమ్మింగ్ పూల్ దగ్గర హారిక హాని చేసిన పని ఒకటి.. ఈ రెండు సీన్స్ కొంచెం ఆడ్ గా అనిపించాయి. సెకండ్ హాఫ్ ఇంకా కొంచెం కొత్తగా రాసుకున్నా లేక ల్యాగ్ కాస్త తగ్గించినా ఎఫ్ 2 సినిమా హిట్ టాక్ తో కాకుండా సూపర్ హిట్ టాక్ తెచ్చుకునేదేమో. ఎఫ్ 2 సినిమా చివరిలో సీక్వెల్ కూడా ఉంటుందని కన్ఫామ్ చేసిన అనిల్ రావిపూడి, ఆ సినిమాని ఎప్పుడు పట్టాలెక్కిస్తాడో చూడాలి. మొత్తానికి ఈ సంక్రాంతికి కంప్లీట్ ఫ్యామిలీ కోరుకునే ఎలిమెంట్స్ అన్నీ ఉన్న ఈ ఎఫ్ సినిమా నుంచి కొత్త కథ, ఊహించని మలుపులు ఎక్స్పెక్ట్ చేయకుండా థియేటర్ కి వెళితే హ్యాపీగా సినిమా చూసి ఎంజాయ్ చేసి వస్తారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *