శ్రీలంకలోని కొలంబోలో వరుస పేలుళ్లు

శ్రీలంకలోని కొలంబోలో వరుస పేలుళ్లు

శ్రీలంకలోని కొలంబో బాంబు దాడులతో దద్దరిల్లింది. ఈస్టర్‌ పండుగ సందర్భంగా చర్చిలకు వచ్చేవారిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు వరుస పేలుళ్లకు పాల్పడినట్టు తెలుస్తోంది. రద్దీగా ఉండే వివిధ ప్రాంతాల్లో అమర్చిన బాంబులను ఉగ్రవాదులు పేల్చినట్టు సమాచారం.

కొలంబోలో కొచ్‌చికాడోలోని సెయింట్‌ ఆంథోనీ చర్చిలో, కథువాపితియాలోని కటానా చర్చిలో బాంబు పేలుడు చోటుచేసుకుంది. షాంగ్రి లా హోటల్‌, కింగ్స్‌ బరీ హోటల్‌లో కూడా బాంబుపేలుడు సంభవించినట్టు పోలీసులు గుర్తించారు. దాడిలో గాయపడ్డ వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *