అక్కడా అంతే..! రెండోదశ పోలింగ్‌లోనూ ఈవీఎంల మొరాయింపు

అక్కడా అంతే..! రెండోదశ పోలింగ్‌లోనూ ఈవీఎంల మొరాయింపు

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్‌కు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. కేంద్రపాలిత ప్రాంతం అయిన పుదుచ్చేరితో పాటు 12 రాష్ట్రాల్లో…95 లోక్‌సభ స్థానాలకు గురువారం ఎన్నికలు జరగనున్నాయి. 97 స్థానాల్లో పోలింగ్‌ జరగాల్సినప్పటికీ డీఎంకే అభ్యర్థి నివాసంలో భారీ నగదు పట్టుబడటంతో తమిళనాడులోని వేలూరు ఎన్నికను రద్దు చేశారు.శాంతిభద్రతల దృష్ట్యా తూర్పు త్రిపుర స్థానంలో పోలింగ్‌ను ఏప్రిల్‌ 23కు ఈసీ వాయిదా వేసింది. మరోవైపు ఈ రెండో దశ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కొన్ని చోట్ల హోరాహోరీ పోరు జరగనుంది.

అయితే…ఏపీ పోలింగ్ సమయంలో ఈవీఎంల మొరాయింపు కొనసాగింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు మొరాయించాయి. తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఈవీఎంల్లో సాంకేతిక లోపాలు ఇబ్బంది పెట్టాయి. ఫలితంగా ఆయా రాష్ట్రాల్లోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 9 గంటల వరకూ పోలింగ్ మొదలుకాలేదు. ఉత్తర్ ప్రదేశ్ లోని మధుర, ఆగ్రా, ఫతేపూర్ సిక్రీ లోక్‌సభ నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల పోలింగ్ ఆలస్యంగా మొదలైంది. సీనియర్ నటి హేమామాలిని బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న మధుర లోక్‌సభ పరిధిలో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ నియోజకవర్గంలోని కొన్నికేంద్రాల్లో మాక్ పోలింగ్ లోనూ ఈవీఎంలల్లో లోపాలు తలెత్తినట్లు తెలుస్తోంది. ఒడిశాలోని బోలంగిర్ లోక్‌సభ పరిధిలో ఇదే తరహా సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ కూడా ఆలస్యంగా పోలింగ్ ఆరంభమైంది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *