వాల్డ్‌కప్‌లో భారత్ తొలి ఓటమి

వాల్డ్‌కప్‌లో భారత్ తొలి ఓటమి

 

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయింది. భారత్‌పై 31 పరుగుల తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది.ఇక చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో గెలిస్తే ఇంగ్లండ్ సెమీస్‌కు చేరుతుంది. మరోవైపు భారత్‌.. బంగ్లాదేశ్, శ్రీలంకతో ఆడాల్సి ఉంది. వీటిలో ఏ ఒక్క మ్యాచ్ గెలిచినా భారత్ సెమీస్‌కు వెళ్తుంది.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *