బీజేపీ, జేడీయూ బంధం ఇక ముగిసినట్లేనా?

బీజేపీ, జేడీయూ బంధం ఇక ముగిసినట్లేనా?

బిహార్‌లో అధికార జేడీయూ, మిత్రపక్షం బీజేపీ బంధం తెగిపోయినట్లేనా.. అనే ప్రశ్న బలంగా వినిపిస్తోంది. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఆ తరువాత జేడీయూ పట్ల వ్యవహరిస్తున్న తీరు ఈ ప్రశ్నకు మరింత బలం చేకూరుస్తోంది. బిహార్‌లోనే బీజేపీతో పొత్తు కొనసాగిస్తామని, బయట మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తామని నితీష్‌ స్పష్టం చేశారు. కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కకపోయినప్పటికీ ఎన్డీయేలోనే చేరుతామని నితీష్‌ వివరణ ఇచ్చినప్పటికీ.. ఆపార్టీ నేతల మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రానున్న రాజ్యసభ సమావేశాల్లో కీలకమైన త్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని జేడీయూ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఆ రెండు పార్టీల మధ్య దూరం పెరుగుతోందన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *