ప్రచారంలో దూసుకుపోతున్న కారు...గందరగోళంలో కూటమి

ప్రచారంలో దూసుకుపోతున్న కారు...గందరగోళంలో కూటమి

తెలంగాణ లో ముందస్తు ప్రకటన రావడంతోనే 105 మంది టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు గులాబీ బాస్‌ కేసీఆ.అక్కడక్కడా చిన్న చిన్న అసంతృప్తి జ్వాలలు ఎగసినా. అభ్యర్థులంతా బరిలో దిగి ఓటర్‌ దేవుళ్ళను కలుస్తూ. అన్నీ ‘సెటిల్‌’చేసుకుంటున్నారు.

రోజుకో మలుపు తిరుగుతున్న కూటమి వ్యవహారం

కానీ కాంగ్రెస్ కెప్టన్సీ లోని ప్రజాకూటమి వ్యవహారం మాత్రం రోజుకో మలుపు తిరుగుతూ మహా గందరగోళం లో పడిపోయింది. రోజుకో పార్టీ లెక్కలు సెటిల్‌ చేయడం తోనే పుణ్యకాలం గడిచిపోతుంది.

Telangana Elections 2018

గెలిచే సీట్లలోనే పోటి చేయాలని ఆర్బాటానికి పోయి భంగ పడవద్దని టీటీడీపీ నేతలకు చంద్రబాబు హితబోధ చేయడం తో ఆ పార్టీ నుంచి కాంగ్రెస్‌ కు పెద్దగా తలనొప్పులు లేవు కానీ తెలంగాణ జనసమితి నేతలు ముందు నుంచి కూడా 15, 10 సీట్లకు తగ్గేది లేదని తేల్చిచెప్పుకుంటూ వచ్చినా చివరికి వారు 8 సీట్లకు సర్దిపెట్టుకోవాల్సి వచ్చేలా ఉంది. ఎవరెవరు ఏ ఏ స్థానాల్లో పోటి చేయాలనే అంశం పై ఇంకా స్పష్టత రాలేదు.

సీట్లకు తగ్గేది లేదన్న టీజేఎస్‌

మరోవైపు కూటమి భాగస్వామ్య పక్షాల్లో టీడీపీ కొంత ప్రశాంతంగానే కనిపిస్తున్నా, సీపీఐ, టీజేఎస్‌ మాత్రం కుతకుతలాడిపోతున్నాయి. కాంగ్రెస్‌ చేస్తున్న జాప్యం కారణంగా తాము ఎన్ని స్థానాల్లో, ఎక్కడెక్కడ పోటీ చేయాలన్న దానిపై ఇంతవరకు స్పష్టత రాలేదని, ఎన్నికలకు కనీసం నెల రోజులు కూడా లేని పరిస్థితుల్లో ఇంకెన్నాళ్లు ఈ స్పష్టత కోసం ఎదురుచూడాలో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయని బహిరంగంగానే విమర్శిస్తున్నాయి.. తేడా వస్తే మా దారి మాదే అంటూ సీపీఐ గట్టిగా వార్నింగ్‌ ఇచ్చింది.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *