చంద్రగిరి నియోజకవర్గంలో ఉద్రిక్తత..

చంద్రగిరి నియోజకవర్గంలో ఉద్రిక్తత..

చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని రామచంద్ర పురం మండలం ఎన్ ఆర్ కమ్మపల్లెలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఎన్నికల సంఘం రీపోలింగ్ కి ఆదేశించిన ఐదు కేంద్రాలలో ఒకటైన ఎన్ ఆర్ కమ్మపల్లె గ్రామంలోకి వెళ్లాలని వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రయత్నించారు. అయితే ఆయనను గ్రామంలోకి రానీయకుండా స్థానికులు అడ్డుకున్నారు. దళితులపై టీడీపీ నేతలు చేశారని, బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్నానని చెవిరెడ్డి నచ్చజెప్పబోయారు. ఇంతలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇద్దరు అభ్యర్థులు ఎదురు పడటంతో గ్రామస్థులు ఆందోళన చెందారు. అర్బన్ ఎస్పీ అన్బురాజన్ కూడా దళితవాడను సందర్శించారు. గ్రామంలోకి ఇద్దరు నేతలు వెళ్లకుండా అడ్డుకున్నారు. పోలీసులు ఎంత చెప్పినా వినకుండా గ్రామంలోకి వెళ్లబోయిన చెవిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇటు చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని ఐదు చోట్ల రేపు రీపోలింగ్ జరగనుంది. అయితే రీ పోలింగ్‌పై టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అయితే ఈ రీపోలింగ్‌పై ఈసీ ఉత్తర్వులను నిలిపివేయాలని హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం శనివారానికి వాయిదా వేసింది. విచారణలో కోర్టు ఏం తీర్పునిస్తుందా..? అసలు రీ పోలింగ్ ఉంటుందా..? ఉండదా? అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు టీడీపీ ఫిర్యాదులను ఈసీ పట్టించుకోలేదని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఢిల్లీలో సీఈసీ సునీల్‌ అరోరాతో సమావేశమై.. చంద్రగిరి నియోజకవర్గంలో రీపోలింగ్‌పై ఫిర్యాదు చేశారు. ద్వివేదికి కళ్ళు కనిపించడం లేదా.. టీడీపీ ఫిర్యాదులను పట్టించుకోరా? అని ప్రశ్నించారు. వైసీపీ ఫిర్యాదులపై ఈసీ వెంటనే స్పందిస్తోందన్నారు. ఎన్నికలు జరిగిన 35 రోజుల తర్వాత రీపోలింగ్‌కు ఆదేశించడమేంటన్నారు. ఈసీ నిర్ణయాలు వివాదాస్పదంగా ఉంటున్నాయన్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *