గ్లామర్ డోస్ పెంచిన ఇషా రెబ్బా!

గ్లామర్ డోస్ పెంచిన  ఇషా రెబ్బా!

తెలుగు అమ్మాయి ఇషా రెబ్బాకు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన చాలా రోజుల తరువాత అవకాశాలు వస్తున్నాయి. వచ్చిన ఛాన్స్‌ని యూజ్ చేసుకోని స్టార్ స్టేటస్ అందుకొవాలిని చూస్తుంది. కానీ అమ్మడి అదృష్టం లేకపోవడంతో మళ్లీ మొదటికే వస్తుంది. అందకే కాస్త గ్లామర్ పరంగా డోస్ పెంచిన ఈ బ్యూటీ ఓ క్రేజీ ప్రాజెక్ట్ ఆఫర్ కొట్టేసిందట.

తెలుగుమ్మాయిలకి టాలీవుడ్‌లో అవకాశాలు తక్కువ అనే మాట ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. కానీ అచ్చ తెలుగు అమ్మాయి ఈషా మాత్రం మంచి సినిమాలే చేస్తుంది. అయితే ఈ బ్యూటీకి అవకాశాలు వస్తున్నప్పటికి సరైన సక్సెస్ మాత్రం అందుకోలేకపోతుంది. ఇండస్ట్రీకి వచ్చిన చాలా రోజులు అవుతున్నకెరీర్ సెట్ అయ్యో హిట్ మాత్రం రావడం లేదు. అరవింద సమేత సినిమాలో ఈషా రెబ్బాకు మంచి క్యారెక్టరే పడింది. ఇక సుబ్ర‌హ్మ‌ణ్య‌పురం, బ్రాండ్ బాబు సినిమాలో కూడా త‌న‌దైన న‌ట‌న‌తో మెప్పించింది. కానీ ఈ సినిమాలు ఈ బ్యూటీ కెరీర్‌కు ఏ మాత్రం హెల్ప్ అవ్వలేదు. కంటెంట్ ఉన్న స్టోరీస్‌తో పాటు కమర్షియల్ చిత్రాలు చేసినా వర్కౌట్ కాకపోవడంతో గ్లామర్ డోస్ పెంచినా ఈషా అవకాశాల కోసం హాట్ ఫోటోస్‌ని నెట్టింట్లో అప్‌లోడ్ చేస్తుంది .

ఈషా ఫోటోలు యూత్ ని ఆకట్టుకుంటున్నాయి. కానీ దర్శక నిర్మాతలని అట్రాక్ట్ చేస్తున్నట్లు లేవు. అందుకే ఈషా లాస్ట్ సినిమా రిలీజ్ అయ్యి నాలుగు నెలలు కావొస్తున్నా ఒక్క అవకాశం కూడా అమ్మడి చేతికి రాలేదు. తాజాగా ఓ కొత్త ప్రాజెక్ట్ సైన్ చేసిందని తెలుస్తోంది.. ఢ‌మ‌రుకం దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి ఓ హార‌ర్ సస్పెన్స్ థ్రిల్ల‌ర్‌ను తెర‌కెక్కించ‌బోతున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్‌కు వెళుతుంద‌ని సమాచారం. మరి ఈ సినిమా ఈషా రెబ్బా కెరీర్‌కు ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *