పశ్చిమబెంగాల్‌ అల్లర్లపై ఈసీ కొరడా

పశ్చిమబెంగాల్‌ అల్లర్లపై ఈసీ కొరడా

పశ్చిమబెంగాల్‌ ఎన్నికల ప్రచారంలో హింసపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 17  సాయంత్రం వరకు తుది దశ ఎన్నికల ప్రచారానికి సమయం ఉన్నప్పటికీ…..బెంగాల్‌లో మాత్రం గురువారంతో ప్రచారాన్ని ముగించాలని పార్టీలను ఆదేశించింది. దేశంలోనే తొలిసారిగా ఆర్టికల్ 324ను ఉపయోగించి ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

అమిత్‌షాపై కోల్‌కతా పోలీసులు ఎఫ్ఐఆర్‌ నమోదు చేయడాన్ని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తప్పుపట్టారు. ఇది ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమేనని మండిపడ్డారు. ప్రజల ప్రజాస్వామ్య హక్కులను నీరుగార్చేందుకు వ్యవస్థలను మమతా బెనర్జీ దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. బెంగాల్‌లో రాజకీయ హింసాకాండ ఘటనలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

తన రోడ్‌షో పశ్చిమబెంగాల్‌లో చెలరేగిన హింసాకాండపై మమతా బెనర్జీని.. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా తప్పుపట్టారు. అల్లర్లకు బీజేపీదే బాధ్యతంటూ టీఎంసీ చెప్పడాన్ని ఎద్దేవా చేశారు. టీఎంసీ పశ్చిమబెంగాల్‌లోనే పోటీ చేస్తోందని.. బీజేపీ మాత్రం దేశవ్యాప్తంగా పోటీ చేస్తుందని అమిత్ షా అన్నారు. కలకత్తాలో మినహా ఎక్కడా అల్లర్లు జరగలేదని.. దీనికి బీజేపీ కారణం ఎలా అవుతోందని ప్రశ్నించారు.టీఎంసీ ఎంత వరకైనా వెళ్తుందని, దాడి నుంచి తాను అదృష్టం వల్లే తప్పించుకోగలిగానని అమిత్‌షా చెప్పారు. బీజేపీ కార్యకర్తలను చితకొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *