కూకట్‌పల్లి టీడీపీ ఎమ్మెల్సీ జూపూడి ఇంట్లో పోలీసుల సోదాలు

కూకట్‌పల్లి టీడీపీ ఎమ్మెల్సీ జూపూడి ఇంట్లో పోలీసుల సోదాలు

కూకట్‌పల్లి బాలాజీ నగర్‌లో టీడీపీ ఎమ్మెల్సీ.. జూపూడి ప్రభాకర్ రావు‌ ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. అంతకుముందు జూపూడి ఇంటి వెనుక నుంచి డబ్బుల మూటలతో పారిపోతున్న ఇద్దరిని టీఆర్ఎస్ కార్యకర్తలు రెడ్ హ్యాండెడ్‌‌గా పట్టుకున్నారు. అనంతరం క్యాష్‌ సహా ఇద్దరు నిందితులను స్థానిక పోలీసులకు అప్పగించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

జూపూడి దళిత ద్రోహి

ఎన్నికల వేళ డబ్బుల కట్టల బయటపడంతో అక్కడి స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జూపూడిని వెంటనే అరెస్ట్ చేయాలని టీఆర్ఎస్‌ కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. అంతేకాదు.. జూపూడి దళిత ద్రోహి అంటూ ఆయన నివాసం ఎదుట నిరసనకు దిగారు.

tdp mlc jupudi prabhakar

క్యాష్‌ ఎలా వచ్చిందో నాకు తెలియదు -జూపూడి

ఇదిలాఉంటే.. టీఆర్ఎస్ కార్యకర్తల వాదనను టీడీపీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ తప్పుబట్టారు. పోలీసుల సోదాల్లో ఏమీ దొరకలేదని చెప్పారు. ఆ డబ్బు ఎలా వచ్చిందో…ఎక్కడి నుంచి వచ్చిందో తనకు తెలియదన్నారు. కొందరు కావాలనే తనపై కక్ష్యగట్టి ఇలాంటి పనులు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *