బంకమట్టి తింటే...పొట్ట కరిగిపోవును!

బంకమట్టి తింటే...పొట్ట కరిగిపోవును!
బాల్యంలో అందరూ ఏదొక సందర్భంలో మట్టిని తిన్నాం. ఆడుకుంటూ మట్టిని నోట్లో వేసుకునేవాళ్లం. మట్టి తినకూడదని అమ్మలు రెండు దెబ్బలు వేసే ఉంటారు. ఇపుడంటే అపార్ట్‌మెంట్ కల్చర్ వచ్చింది కానీ 90లలో పుట్టిన వారందరూ మట్టిలో ఆడుకుని, దుమ్మునీ, ధూళినీ ఒంటికి అంటించుకుని…అవే చేతుల్తో అన్నం తిన్న సందర్భాలు ఎన్నో ఉంటాయి. అయితే…మట్టి తినడం వల్ల మానవ శరీరానికి మేలే కానీ నష్టం ఏమాత్రం ఉండదేమో..!? అవును నిజమే అంటున్నారు శాస్త్రవేత్తలు.

మానవ జీవితం మొదలైనప్పటినుంచి మనిషి ఏదొక రూపంలో మట్టిని తింటున్నాడు. అందుకేనేమో అప్పటి మనుషుల ఆయుష్షు ఎక్కువ ఉండేది. ఈ కొత్త శతాబ్దం మొదలయ్యాక సబ్బులతోనూ, వాషింగ్ క్రీములతోనూ చేతులను కడుక్కుని రసాయనాలు తింటూ అనారోగ్యం పాలవుతున్నాం. కానీ, బంకమట్టిని తింటే మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలని యూనివర్శిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు వారి అధ్యయనంలో తెలిపారు.

health tips

బంకమన్ను తింటే పొట్ట కరిగింది…

అలా అని నేరుగా బంకమట్టిని తింటే మీ పనంతే…పొట్ట కరిగిపోతుందని బంకమట్టి నోట్లోకి వేసుకుంటే ఇబ్బందులొచ్చేస్తాయి. శాస్త్రవేత్తలు చెబుతున్నది వారు స్పెషల్‌గా ప్రాసెస్ చేసిన బంకమన్ను గురించట ! ఎలుకలపై చేసిన పరిశోధనలో కొన్ని ఎలుకలకు ఒబెసిటీ మెడిసిన్, మరికొన్ని ఎలుకలకు ప్రాసెస్డ్ బంకమట్టి ఇచ్చారు. రెండు వారాలపాటు ఇలాగే కొనసాగించి వాటిపై అధ్యయనం చేశారు. డ్రగ్ తీసుకున్న ఎలుకల కంటే మట్టి తిన్న ఎలుకల్లో వెయిట్‌లాస్ స్పష్టంగా ఉన్నట్టు గుర్తించారు. రెండు గ్రూపు ఎలుకలను పరిశీలించగా…మట్టి తీసుకున్న ఎలుకల్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా ఆరోగ్యంగా ఉన్నట్టు గుర్తించారు. బంకమట్టిలోని ఒక రకమైన సూక్ష్మ మురికిలాంటి పదార్థం పేగుల్లోని కొవ్వును పీల్చేస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీన్ని మనుషులపై ప్రయోగించడానికి అధ్యయనం ఇంకా కొనసాగాలని చెప్పారు.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *