ప్రధానికి షాక్ : రూ.271 కోట్లతో భార్య పరార్

ప్రధానికి షాక్ : రూ.271 కోట్లతో భార్య పరార్

దుబాయ్‌లో దొంగలు పడ్డారు. ఏకంగా ప్రధాని మంత్రి ఆస్తినే దోచుకుపోయారు. అయితే ఇంటిమనుషులే దొంగలు కావటంతో రాజుగారికి ఏంచేయాలో తోచటంలేదు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్ ప్రధానమంత్రి, అపర కుబేరుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ ఆరో భార్య హయా బింట్ ఆల్ హుస్సేన్ తన పిల్లలతో కలిసి పారిపోయారు. 31 మిలియన్ల ఫౌండ్లు అంటే 270 కోట్ల పై మాటే…. ఆస్తితో పరార్ అయ్యారు. ఆమెతో ఇద్దరు పిల్లలు
ఈ వార్తే ఇప్పుడు ప్రపంచ దేశాల్లో హాట్ టాపిక్‌గా మారింది. హయా బింట్ ఎందుకు పారిపోయి ఉంటారు అని పలువురు సందేశాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే హయా బింట్ ఆల్ హుస్సేన్ మాత్రం కుటుంబ కలహాల కారణంగా వెళ్లిపోయినని హయా తెలిపారు. ఆమె లండన్‌లో ఉన్నట్టు పలువురు బావిస్తున్నారు. ముందుగా జర్మనీ ఆశ్రమం కోరినప్పటికీ ఆమోదం లభించకపోవటంతో లండన్‌లో రహస్య ప్రాంతలో ఆమె ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె తన భర్త నుంచి విడాకులు కోరుతున్నట్లు కొందరు చెబుతున్నారు.

మహ్మద్‌ బిన్‌ రషీద్‌ కుమార్తె షేక్‌ లతిఫా కూడా గతేడాది దుబాయ్‌ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. వెళ్లిపోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న లతిఫా… మితిమీరిన బంధనాల మధ్య బతకలేనంటూ తన తండ్రిని విమర్శిస్తూ యూట్యూబ్‌లో ఒక వీడియో పోస్ట్‌ చేశారు. అయితే తన ప్రయత్నం ఫలించలేదరు. అప్పట్లో లతిఫా వెళ్లిపోవడానికి చేసిన ప్రయత్నాలలో హయా పాత్ర కూడా ఉందని విమర్శలు వచ్చాయి. హయా సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండేవారు. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనే వారు. వాటికి సంబందించిన ఫోటోలను పోస్ట్ చేసేవారు. గత కొంత కాలంగా ఆమే సోషల్ మీడియాలో గానీ.. బహిరంగంగా కనిపిచలేదు. అయితే చివరికి పరార్ అయ్యారేనే వార్తలతో హాట్ టాఫిక్ గా మారారు.

తన భార్య ఈ విధంగా పరార్ అవ్వటంపై స్పందించిన మహ్మద్‌ బిన్‌ రషీద్ భావోద్వేగానికి గురైయ్యారు. ఆమె వైఖరిని తప్పుబడుతూ అరబిక్‌లో కవిత రాసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. తన నమ్మకాన్ని వమ్ము చేసి మోసం చేసిందని.. ఆమె బతికున్నా చనిపోయినా తనకు అనవసరమని పేర్కొన్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *