మందేసి చిందేసిన బీజేపీ ఎమ్మెల్యే

మందేసి చిందేసిన బీజేపీ ఎమ్మెల్యే

వివాదాస్పద చర్యలతో తరచుగా వార్తల్లో నిలిచే ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యే ప్రణవ్ సింగ్ ఛాంపియన్ మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. మద్ధతుదారులతో కలిసి ఆయుధాలతో డ్యాన్స్ చేస్తూ కెమెరా కంటికి చిక్కారు.

రెండు చేతుల్లో గన్స్ పెట్టుకుని బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేశారు. మధ్య మధ్యలో మందు తాగుతూ.. తుపాకులను నోట్లో పెట్టుకుని సందడి చేశారు. కాలు ఆపరేషన్ తర్వాత కోలుకున్న ప్రణవ్ సింగ్ తన మద్ధతుదారులను కలిసిన సందర్భంలో గన్ డ్యాన్సులతో ఆయన హంగామా సృష్టించారు.

అక్కడితో ఆగకుండా గ్లాసులో మందు పొసుకుంటూ.. దానిని సేవిస్తూ.. అసభ్యపదజాలం వాడుతూ మందు బాబులతో కలిసి చిందులేశారు. కాగా ఇప్పటికే క్రమశిక్షణ ఉల్లంఘన, అసభ్య ప్రవర్తన కారణంగా అతనిని బీజేపీ ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *