పాలతో అధిక బరువుకు చెక్‌...

పాలతో అధిక బరువుకు చెక్‌...

“పాలు సంపూర్ణ ఆహారం” ఈ మాటను మనం చిన్నప్పటి నుంచీ వింటూనే ఉన్నాం. పాలలో కాల్షియం, ప్రోటీన్లూ, విటమిన్లూ ఉంటాయనీ, చక్కని పోషకాహారమనీ అనేక సార్లు చదువుకున్నాం. ఎన్నోసార్లు డాక్టర్ల నోటి నుంచీ విన్నాం. కీళ్లు గట్టిపడటానికీ, శక్తిని నింపుకోవడానికీ కూడా పాలు ఉపయోగపడతాయి. మంచి నిద్రకోసం కూడా రాత్రిపూట పాలను తీసుకుంటారు. ఇలా పాల వల్ల బోలెడు ఉపయోగాలున్నాయి. అందుకే పాలను దైనందిక జీవితంలో భాగం చేసుకున్నాం. చిన్నపిల్లలనైతే క్రమం తప్పకండా ప్రతిరోజూ రెండుసార్లు పాలు తాగేలా చూసుకుంటాం. పాల వల్ల ఇంకా మనకి తెలియని ఉపయోగాలు కూడా ఉన్నాయంటున్నారు. వాటిపైన ఓ లుక్కేద్దాం పదండి.

Milk health Tips

బరువుకూడా తగ్గొచ్చు…

పాల వల్ల అనేక రకాలుగా శక్తిని పొందటమే కాకుండా బరువునూ తగ్గించుకోవచ్చు. పాల ద్వార శరీరంలోకి వచ్చిన కాల్షియం అనవసరపు కొవ్వును తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. దాని స్థానంలోకి అవసరమైన కొవ్వు చేరుతుంది. అనవసరపు కొవ్వు క్రమక్రమంగా తగ్గతూ పొట్ట భాగంలోని కొవ్వు కూడా తగ్గిపోతుంది. దీంతో బరువు అదుపులో ఉంటుంది. ఇలా పాలను వయసులకు అతీతంగా ప్రతిరోజూ తీసుకోవడం వల్ల డయాబెటిస్‌కూ, గుండె జబ్బులకూ దూరంగా ఉండొచ్చు. చాలా ఆహార పదార్ధాలతో పోల్చితే, పాలలో తక్కువ కేలరీలూ, ఎక్కువ ప్రోటీన్లూ ఉంటాయి. దీని వల్ల కండరాలు పెరిగి కొవ్వు తగ్గుతుంది. పాలను తాగడం వల్ల మంచి పోషకాలను పొందడంతో పాటు, కొవ్వునూ, బరువునూ తగ్గించేసుకోవచ్చు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *