ఎండ వేడికి బైక్ సీట్‌పై దోశె రెడీ!

ఎండ వేడికి బైక్ సీట్‌పై దోశె రెడీ!

ఎండలు మనుషులను కాల్చేస్తున్నాయి. ఉదయం పదింటికి బయటకు వస్తే నిప్పులతో స్నానం చేసినంత మంట నెత్తిన తగుల్తోంది. దీంతో ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్పించి సాధారణంగా బయటికి రావడానికి జంకుతున్నారు. ఇప్పటికే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు మించి ఉండటంతో ప్రజలు ఎండ వేడిని తట్టుకునే శక్తిని కోల్పోతున్నారు. ఇదే సమయంలో కొందరు సోషల్ మీడియాలో పోస్ట్‌లతో మాడుతున్న ఎండలపై పోస్ట్‌లు పెడుతూ సరదా సరదాగా గడిపేస్తున్నారు.

నిప్పుల కొలిమిగా మారిన ఎండల నుంచి తప్పించుకోవడానికి…ఆ ఎండలను ట్రోల్ చేయడానికి సిద్ధమైపోయారు కొందరు నెటిజన్లు…ఒక వ్యక్తి ఏకంగా టూవీలర్ సీట్‌పై దోసే వేసి ఎండ తీవ్రత ఏ రేంజ్‌లో ఉందో చూపించాడు. దోశె పిండి సీటుపై వేయగానే పొయ్యిమీద వేసినంత వేగంగా దోశె సిద్ధమవడం చూస్తే ఆశ్చర్యపోతాం. అలాగే…ఓ మహిల ఇంటి మేడపై కూర్చొని ఎండ వేడికి కాగిన నూనెలో బజ్జీలూ వేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇదే సమయంలో వాతావరణ అధికారులు ప్రజలకు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ఎండ ఉన్న సమయంలో బయటకు వెళ్లడం ఎంత తక్కువైతే అంత మంచిదని చెబుతున్నారు. వీలైనంత ఎక్కువగా నీళ్లను తాగాలని, శరీరం డీహైడ్రేట్ అవకుండా చూసుకోవాలని తెలిపారు. ఇక చిన్న పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *