అమెరికాకు వెళ్లే ఐటీ నిపుణులకు గుడ్ న్యూస్

అమెరికాకు వెళ్లే ఐటీ నిపుణులకు గుడ్ న్యూస్

trump

అమెరికాకు వెళ్లే ఐటీ నిపుణులకు శుభవార్త అందించారు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్. భారత ఐటీ నిపుణులకు మేలు చేసేలా ప్రతిభ ఆధారిత వలస విధానాన్ని ఆయన ప్రకటించారు. గ్రీన్‌కార్డుల జారీలో అత్యున్నత ప్రతిభ ఉన్న వలస ఉద్యోగుల కోటాను 12 శాతం నుంచి 57శాతానికి పెంచుతున్నట్లు వెల్లడించారు. దీంతో పాటు వలసదారులు ఇంగ్లిష్ తప్పనిసరిగా నేర్చుకుని ఉండాలని, అలాగే అమెరికా చరిత్ర, సంస్కృతి తదితర అంశాలపై నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. కాగా దాదాపు 54 ఏళ్ల క్రితం అమెరికా వలస విధానంలో సంస్కరణలు చేశారు. ఆ తర్వాత ఈ విధానంలో మార్పులు చేయడం మళ్లీ ఇప్పుడే. తాజా నిర్ణయం ఐటీ నిపుణులకు మేలు చేయనుందని విశ్లేషకులు చెబుతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *