నదిలో పడిపోతున్న చిన్నారిని కాపాడిన కుక్క!

నదిలో పడిపోతున్న చిన్నారిని కాపాడిన కుక్క!

పెంపుడు జంతువులు మనకు ఆసరాగా ఉండటానికే కాదు మనకొక తోడు కూడా..మనం నిరాశలో ఉన్నపుడు మన భావోద్వేగాలను మార్చి ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి. వీటిలో ఎక్కువగా శునకాలదే పైచేయి. గతం కంటే ఇప్పుడు పెంపుడు కుక్కల సంఖ్య పెరిగింది. ప్రతి ఇంట్లో ఓ కుక్క కనబడుతుంది. అయితే…ఈ పెంపుకు కుక్కల వల్ల మానసిక సౌఖ్యమే కాకుండా…అప్పుడపుడు మనల్ని రక్షించడంలో కూడా ఇవి ముందుంటాయి. నదిలో పడిపోతున్న చిన్నారిని కాపాడిన్న ఓ కుక్క గురించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

నోటితో పాప గౌను పట్టి…
వడివడిగా అడుగులు వేసుకుంటూ నదిలోకి వెళ్లిన ఓ చిన్నారి పాప ప్రాణాలను కుక్క కాపాడింది. నదీ తీరంలో చిన్నారి ఆడుకుంటుండగా.. పాప చేతిలో ఉన్న బంతి నీళ్లలో పడిపోయింది. ఆ బంతిని తీసుకునేందుకు చిన్నారి వడివడిగా అడుగులు వేసుకుంటూ ముందుకెళ్లింది. నీటిలోకి వెళ్తున్న చిన్నారిని అక్కడే ఉన్న పెంపుడు కుక్క గమనించి.. గౌనును నోటితో పట్టి వెనుకకు లాక్కొచ్చింది. ఆ తర్వాత నీటిలోకి వెళ్లి బంతిని తీసుకువచ్చింది ఆ శునకం. ఒకవేళ కుక్క గమనించి ఉండకపోయి ఉంటే చిన్నారి నీళ్లలో మునిగిపోయే ప్రమాదం జరిగేది. చిన్నారి ప్రాణాలను శునకం కాపాడడంతో.. ఆ కుక్కను పలువురు ప్రశంసిస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. విశ్వాసానికి మారుపేరు శునకం అని మరోసారి నిరూపించుకుంది…అంటూ కొందరు భావోద్వేగంతో కామెంట్లు కూడా పెడుతున్నారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *