కార్పొరేట్ కాలేజీల ఆదాయాలెంతో తెలుసా..!

కార్పొరేట్ కాలేజీల ఆదాయాలెంతో తెలుసా..!

ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు బోర్డు తప్పిదాలతో పాటు ప్రైవేటు కాలేజీల దోపిడీ విధానాలు కూడా కారణమనే చెప్పాలి. కార్పొరేట్ విద్య పేరుతో విద్యార్థులను నిలువునా దోచేస్తున్నారు..ట్రస్ట్ ల పేరుతో విద్యా దానం చేస్తున్నట్టు పైకి బిల్డప్ ఇస్తూ.. బిల్డింగ్ ల మీద బిల్డింగ్ లు కట్టుకుంటూ పోతున్నారు. ప్రతి విద్యా సంస్థకు ఓ ట్రస్ట్.. దానికి అనుబంధంగా ఓ ప్రైవేట్ కంపెనీ..ఇలా అందిన కాడికి దోచేస్తూ జనం కళ్ళల్లో దుమ్ము కొడుతున్నారు.. తెలుగు నేలపై అక్టోపస్ లా విస్తరించిన కొన్ని కార్పొరేట్ కాలేజీలు.. వాటి దోపిడీ తీరెలా ఉందో తెలుసుకుంటే కళ్ళు బైర్లు కమ్మటం ఖాయం.

ప్రైవేటు కాలేజీలనగానే ఎవరికైనా తక్షణం గుర్తుకొచ్చే పేర్లు శ్రీ చైతన్య,నారాయణ.. ఈ కార్పొరేట్ కాలేజీల ఆదాయాలెంతో తెలిస్తే నివ్వెరపోతాం.. అందుకోసం ఆయా యాజమాన్యాలు అనుసరిస్తున్న విధానాలు చూస్తే విస్తుపోతాం.. వేల కోట్ల సామ్రాజ్యాలుగా ఎదిగిన ఈ కాలేజీల అసలు స్వరూపాలేంటో ఇప్పుడు చూద్దాం..

ప్రతి విద్యా సంస్థకు ఓ ట్రస్ట్ ఉంటుంది. అదొక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. విద్యా సంస్థ లైసెన్స్ కూడా ఈ ట్రస్ట్ పేరు మీదనే ఉంటుంది.. విద్యా సేవ చేస్తున్నందుకు ఈ ట్రస్ట్ కు టాక్స్ లు కూడా ఉండవు. పైకి అంతా మంచిగా కనిపిస్తున్నప్పటికీ ఈ ట్రస్ట్ లు చేసే మోసాలు అన్నీ ఇన్నీ కావు.. ట్రస్ట్ చెప్పేది విద్యా సేవ.. కానీ డబ్బులు దండుకునేది మరో సంస్థ.. అది ట్రస్ట్ కు బినామీ సంస్థ. ఇంకా క్లియర్ గా అర్థం కావాలంటే ఇది చూడండి…

ఉదాహరణకు శ్రీ చైతన్య కాలేజ్ విషయం తీసుకుంటే.. ఈ సంస్థకు 16 ట్రస్ట్ లున్నాయి. అందులో నాలుగు ప్రధానమైనవి..మొదటిది శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్. రెండోది శ్రీ కళ్యాణ చక్రవర్తి మెమోరియల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్..మూడోది నెక్ట్స్ జెన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్… నాలుగోది శ్రీ వశిష్ట ఎడ్యుకేషనల్ ట్రస్ట్.

ఈ ట్రస్ట్ ల కింద లైసెన్స్ లు పొంది శ్రీ చైతన్య కాలేజీలు నిర్వహిస్తున్నారు..వాటిని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా నడిపిస్తున్నారు. కాలేజీలలో బోధించే సిలబస్ ను ట్రస్ట్ లే రూపొందిస్తాయి. దాన్ని కాలేజ్ లకు అసైన్ చేస్తున్నారు. ఇక బుక్స్, యూనిఫామ్స్, హాస్టల్ వసతులు, రవాణా సౌకర్యాల పేరిట విద్యార్థుల నుంచి వేలల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలా ఏడాదికి ఒక్క శ్రీ చైతన్య కాలేజీనే 3వేల కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఈ ఆదాయానికి టాక్స్ కట్టాలి.. దీనికితోడు ఆదాయాన్ని ట్రస్ట్ లకు బదలాయిస్తున్నాయి. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ట్రస్ట్ లు పరస్పరం సేవలందించుకుంటున్నందుకు రాయల్టీని ఇచ్చిపుచ్చుకుంటున్నాయి. ఈ రకంగా టాక్సబుల్ ఇన్ కమ్ ను తగ్గించుకుంటున్నాయి.

నారాయణ కాలేజీ విషయానికొస్తే…
నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేశారు. దీని కింద లైసెన్స్ లు పొందారు. NSPIRA మేనేజ్ మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరుతో కాలేజీలను నిర్వహిస్తున్నారు.. ఫీజులు, బుక్స్, యూనిఫామ్స్, హాస్టల్, రవాణా సౌకర్యాలను కల్పిస్తున్నందుకు విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు.. కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారు.. ఆదాయాన్ని ట్రస్ట్ కు బదలాయిస్తూ టాక్స్ ను తగ్గించుకుంటున్నారు. ఈ సంస్థ యాజమాన్యం టాక్స్ ఎగ్గొట్టినట్లు సమాచారం. వాటి తాలుకు కేసులు కూడా ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *