మజిలీ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్

మజిలీ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్

మజిలీ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైంది దివ్యంశ కౌశిక్. ఈ ముంబై భామ తన స్క్రీన్ ప్రెజెన్స్, నటనతో ప్రేక్షకులను ఫిదా చేసినా.. సినిమాలో హీరోయిన్ క్రెడిట్ మొత్తం సమంతాకే వెళ్ళిపోయింది. దీంతో దివ్యంశకు రావాల్సిన స్థాయిలో పేరు రాకపోవడంతో ప్రస్తుతం ఆమె చెంతకు ఆఫర్స్ రావట్లేదు. మజిలీ చిత్ర యూనిట్ అందరూ కూడా తమ తరువాత సినిమాపై దృష్టి పెడితే.. పాపం ఈ భామ మాత్రం సినిమా ఆఫర్స్ కోసం ఇంకా ఎదురుచూస్తోంది. మొత్తానికి దివ్యంశ పరిస్థితి.. సినిమా హిట్.. హీరోయిన్ ప్లాప్ మాదిరి తయారైంది.ఒకపక్క సరైన హిట్ లేని నిధి అగర్వాల్ లాంటి హీరోయిన్లు మంచి ఆఫర్స్ పట్టుకుంటుంటే.. హిట్ సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసి కూడా దివ్యంశ కౌశిక్ ఖాళీగా కూర్చోవాల్సి వస్తోంది. మజిలీ సక్సస్ మొత్తం సమంత చేతికి వెళ్లిపోవడంతో దివ్యంకా ఖాతాలో మరో సినిమా పడలేదని కొందరు అంటుంటే… కొందరు మాత్రం సినిమాలో ఫస్ట్ హీరోయిన్ గా చేసినా కూడా దివ్యంక ఎక్స్ పోజింగ్ చేసే అవకాశం లేకపోవడంతోనే ఆఫర్స్ రావట్లేదని అంటున్నారు.. ఎవరు ఏమన్నా దివ్యంకలో ఒక స్టార్ హీరోయిన్ కి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయి అనేది మాత్రం అందరూ ఒప్పుకునే మాట. అదృష్టం కలిసి రాకో, లేక సరైన అవకాశం కోసం ఎదురు చూస్తుందో కానీ దివ్యంకాకి మరో మంచి సినిమా పడితే మాత్రం స్టార్ హీరోల సినిమాల్లో అవకాశం రాబట్టే సత్తా ఆమెలో ఉంది. ఏది ఏమైనా మళ్ళీ హీరో నాగ చైతన్య గానీ, దర్శకుడు శివ నిర్వాణ గానీ తమ తరువాత సినిమాల్లో ఛాన్స్‌లు ఇస్తారేమో చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *