వైరల్ అవుతున్న 'దిశా' ఇంస్టాగ్రామ్ వీడియో!

వైరల్ అవుతున్న 'దిశా' ఇంస్టాగ్రామ్ వీడియో!

దిశా పతాని అనగానే అందరూ ఇన్నర్ వేర్ బ్రాండ్ల పాపగా చూడడం మొదలు పెట్టారు. ఎవరికైనా సినిమాల ద్వారా పాపులారిటీ వస్తుంది.. దాంతో కార్పోరేట్స్ బ్రాండ్ అంబాజిడర్ గా నియమించుకుంటాయి. కానీ ఇక్కడ కథే వేరు.. ఇన్నర్ వేర్ బ్రాండ్ అంబాజిడర్ గా మారిన తర్వాతే దిశా క్రేజ్ డబల్ ట్రిపుల్ అయింది! అందుకే అభిమానులు కూడా ఎప్పుడెప్పుడు దిశా, సోషల్ మీడియాలో ఫొటోస్ పెడుతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తారు… అయితే హాట్ ఫొటోస్ పోస్ట్ చేసి బోర్ కొట్టిందేమో కానీ తాజాగా దిశా ఒక అందమైన గౌన్ వేసుకొని ఫోటో షూట్ లో పాల్గొంది. ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేసింది. ఈ ఫొటోస్ తో పాటు ఒక వీడియో కూడా పోస్ట్ చేస్తూ ‘స్లో మోషన్ మే’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ఏమాటకామాటే చెప్పుకోవాలి… ఎప్పుడూ గ్లామర్ షో చేసే దిశా… ఈసారి మాత్రం ఆరెంజ్.. బ్లాక్ కాంబినేషన్ డ్రెస్ లో చాలా అందంగా ఉంది. తీగలు..పూలు.. ఆకులతో ఉన్న డ్రెస్ డిఫరెంట్ గా ఉంది. దిశా లేటెస్ట్ ఫొటోస్ కి మరింత అందం తెచ్చింది, ఆమె మేకప్… కళ్ళకు పింక్ కలర్ మేకప్ వేసుకోవడంతో.. దిశా ఎప్పటికన్నా చాలా కొత్తగా అందంగా కనిపిస్తుందంటూ నెటిజనులు 20 గంటలలోపే 1.2 మిలియన్ లైక్స్ కొట్టారు. సో ఎప్పుడు హీరోయిన్ గ్లామర్ షో చేసిన ఆ న్యూస్ వైరల్ అవుతుంది కానీ దిశా విషయంలో మాత్రం రివర్స్ అయ్యిందన్నమాట.

 

View this post on Instagram

 

Slow motion mein 🌸🙈

A post shared by disha patani (paatni) (@dishapatani) on

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *