వినాయక్ హీరోగా దిల్ రాజు సినిమా...

వినాయక్ హీరోగా దిల్ రాజు సినిమా...

ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో అగ్రదర్శకుల్లో ఒకరిగా ఓ వెలుగు వెలిగిన వివి వినాయక్… టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎన్నో హిట్ చిత్రాలు అందించారు. కొన్ని పరాజయాల కారణంగా కొంత కాలంగా ఇండస్ట్రీలో వినాయక్ హవా తగ్గుతూ వస్తోంది. ఆయన తర్వాతి సినిమా ఎప్పుడు వస్తుందా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం త్వరలో వివి వినాయక్ తన ఫ్యాన్స్‌కు ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతున్నారు. తెర వెనక దర్శకుడిగా కాకుండా… హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది వాస్తవమే అనే టాక్ వినిపిస్తోంది. వినాయక్ హీరోగా నటించబోయే సినిమా వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

దిల్ రాజు నిర్మాణంలో…
వివి వినాయక్ హీరోగా ఎంట్రీ ఇవ్వడమే ఓ పెద్ద ట్విస్ట్ అంటే… ఆ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు నిర్మించబోతుండటం మరో సర్‌ప్రైజ్. కథలో విషయం ఉంటే తప్ప దిల్ రాజు ఏ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయడు. వివి వినాయక్ హీరోగా ఆయన సినిమా చేయబోతున్నారనే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.

ఎన్‌ నరసింహారావు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. ఎన్‌ నరసింహారావు ఇంతకు ముందు ‘శరభ’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. గతంలో శంకర్‌ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన ఆయన వివి వినాయక్‌కు సరిపోయే ఓ అద్భుతమైన కథను సిద్ధం చేశాడని… వినాయక్, దిల్ రాజు ఇద్దరినీ ఒప్పించి సినిమాను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.

వినాయక్‌కు నటించడం అంటే మొదటి నుంచి ఆసక్తే.. అయితే ఇంతకాలం దర్శకత్వంలో ఉండటంతో అది సాధ్యం కాలేదు. గతంలో చిరంజీవి హీరోగా వచ్చిన ‘ఠాగూర్’లో ఓ చిన్న పాత్రలో కనిపించారు. ఇపుడు హీరోగా సినిమా చేయడం వల్ల ఇన్నాళ్లు కలగానే ఉండిపోయిన తన డ్రీమ్ నిజం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

రచయితలు అందరూ దర్శకత్వం బాట పట్టడంతో వివి వినాయక్ సినిమాల సంఖ్య తగ్గుతూ వచ్చింది. దానికి తోడు కొన్ని ప్లాప్ చిత్రాలు ఎదురవ్వడం కూడా ఆయన వెనక బడటానికి కారణం. వినాయక్ నుంచి వచ్చిన చివరి హిట్ మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెం 150’. గతేడాది సాయి ధరమ్ తేజ్ హీరోగా చేసిన ‘జెంటిల్మెన్’ మూవీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైన సంగతి తెలిసిందే.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *