హీరోగా మారనున్న మాస్ డైరెక్టర్

హీరోగా మారనున్న మాస్ డైరెక్టర్

ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చి మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో ఒక రేంజ్ మైంటైన్ చేసిన డైరెక్టర్ వినాయక్… ఒక కొత్త అవతారం ఎత్తాడనీ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్.. సినీ అభిమానులకే షాక్ ఇచ్చిన వినాయక్ కొత్త అవతారం ఏంటో మీరూ చూడండి.

dil raju movie with vv vinayak

ఒకప్పటి టాప్ డైరెక్టర్ వివి వినాయక్, ఇప్పుడు చేతిలో సినిమాలు లేక కాలీగా ఉన్నాడు. దీంతో వినాయక్ ని హీరో చేయాలనే ప్రయత్నాలు ఇండస్ట్రీలో జరుగుతున్నాయి అనే కామెంట్ టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది. ఔను, ఇది నిజం. హీరోలు దర్శకులవుతున్న వేళ, దర్శకులు హీరోలవ్వడంలో తప్పులేదుగా. ఈ సర్‌ప్రైజ్‌కు మరో ఎక్స్ట్రా ఎలిమెంట్ ఏంటంటే – వినాయక్ హీరోగా చేయబోయే సినిమాను నిర్మించబోయేది హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు.

వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పైనే ఈ సినిమాను నిర్మించనున్నాడని ఫిల్మ్ ఇండస్ట్రీ టాక్. రీసెంట్ గా ‘శరభ’ చిత్రాన్ని తెరకెక్కించిన ఎన్ నరసింహారావు వినాయక్‌ను డైరెక్ట్ చేయబోతున్నాడట. ప్రీప్రొడక్షన్స్ అన్నీ పూర్తయ్యాయని, వచ్చే జూలైలో ప్రాజెక్టును సెట్స్‌మీదకు తీసుకెళ్తారన్న టాక్ వినిపిస్తోంది. గతంలో తన సినిమాల్లోనే క్యామియో రోల్స్ లో కనిపించిన వినాయక్, ఇప్పుడు డైరెక్ట్‌గా ఓ ప్రాజెక్టులో లీడ్ రోల్ చేస్తున్నాడనగానే, జోడీ ఎవరై ఉండొచ్చోనన్న సందేహాలు తలెత్తక మానవు. అంతేకాదు, వినాయక్ హీరోయిజం మేకోవర్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తీ మొదలైంది. ఈ ప్రశ్నలకి సమాధానం తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

 

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *