ఉద్వేగానికి గురైన వంశీ పైడిపల్లి

ఉద్వేగానికి గురైన వంశీ పైడిపల్లి

సాధించిందన్నారు. ఆయన మద్దతు మరవలేనిదని తెలిపారు. సినిమా చూసిన తర్వాత.. ఎకరం భూమి కొనుక్కోవాలన్న ఆలోచన ప్రేక్షకుల్లో కలుగుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. రైతులపై సానుభూతి చూపడం కాదని.. మనపై మనం సానుభూతి చూపించుకొనేలా సినిమా చేసిందన్నారు. ఆయనేమన్నారంటే.. ‘‘మదర్స్ డే సందర్భంగా అమ్మకు పాదాభివందనం. నా చిన్నప్పటి నుంచి నన్ను సపోర్ట్ చేసి.. ప్రపంచం నన్ను నమ్మని రోజున నన్ను నమ్మి.. కొడుకుగా.. నన్ను భరించినందుకు మీకు కృతజ్ఞతలు. సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతం అన్నారు. ఎప్పుడో ఏడో తరగతిలో ఉన్నప్పడు జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా చూశాను. ఆ సినిమా స్ఫూర్తితోనే పరిశ్రమకు వచ్చాను. మే 9ని తెలుగు సినిమా కేలండర్‌పై వైజయంతి మూవీస్ పేరు రాసుకోవచ్చు. ఎంతో సంతోషంగా ఉంది. పీవీపీకి కృతజ్ఞతలు. దిల్ రాజు నాకు డైరెక్టర్‌గా జన్మనిచ్చారు. ఆయనను నేను అంకుల్ అని పిలుస్తుంటాను. తనను భయ్యా అని పిలవమన్నారు. కానీ సభా ముఖంగా చెబుతున్నాను. మీరు ఎప్పటికీ అంకులే’’ అంటూ నవ్వులు పూయించారు.

ఈ సినిమాలో ముసలి రైతుగా నటించిన గురుస్వామి పేరును ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘సభా ముఖంగా చెబుతున్నా.. మేము దొరకడం మీ అదృష్టం కాదు. మీరు దొరకడం.. మా అదృష్టం. మీ మాటలకు అంత రియాక్షన్ వచ్చింది. సినిమాలో మీరు చెప్పిన డైలాగులు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశమంతా వినిపిస్తున్నాయి’’ అంటూ ప్రశంసించారు.

ఇక మహేశ్ గురించి మాట్లాడుతూ.. ‘‘వంశీ నా తమ్ముడు అన్నారు. ఆయన ఇంట్లో డ్రాయింగ్ రూమ్ నుంచి హోమ్ థియేటర్… వరకు నా ప్రయాణం అద్భుతం. మీరు మీ జీవితంలో ఎన్నో సాధించారు. కానీ నాకు మీరిచ్చిన మద్దతు మరవలేను. సినిమా విజయంలో 80శాతం మీరిచ్చిన సహకారమే కారణం. మనసులకు చెప్పే సినిమా ఇది. మనసుతో చూశారు. అందరికీ ధన్యవాదాలు’’ అంటూ ప్రసంగాన్ని ముగించారు.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *