సెంటిమెంటతో ఒప్పించేసాడట..!

సెంటిమెంటతో ఒప్పించేసాడట..!

సెంటిమెంట్‌ అందరికీ ఉంటుంది. సినిమారంగంలో కాస్త ఎక్కువ ఉంటుంది. సక్సెస్‌తో ఆ సెంటిమెంట్‌ ఇంకా అధికం అవుతుంది. దర్శకుడు శివ అలాంటి సెంటిమెంట్‌నే నమ్ముతున్నాడు. ఇక తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌కు ఆ హీరోయినే కావాలంటున్నాడట. ఆ బ్యూటీ ఓకే చెప్పే వరకు వెంటపడ్డాట. మరి డైరెక్టర్ శివకు ఉన్న ఆ సెంటిమెంట్ ఏంటి.? ఏ హీరోయిన్ వెంటపడుతున్నాడో తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ…తెలుగు సక్సెస్ అందుకోలేకపోయిన తమిళ్‌లో మాత్రం వరస హిట్స్ అందుకుంటున్నాడు దర్శకుడు శివ. తెలుగులో ఈ దర్శకుడు చేసిన శంఖం, దరువు సినిమాల ప్లాప్ అయ్యాయి. కానీ కోలీవుడ్‌లో మాత్రం బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటున్నాడు. అజిత్‌తో చేసిన ఫస్ట్ మూవీ హిట్ కావడంతో ఈ కాంబినేషన్‌ వరుసగా నాలుగు సినిమాలు వచ్చాయి. త్వరలోనే ఈ కాంబోలో మరో సినిమా రాబోతుందని సమాచారం. అయితే అజిత్ మరో సినిమాతో బిజీగా ఉండడంతో శివ సినిమాకు కాస్త టైం పడుతుంది.. దీంతో ఈ దర్శకుడు సూర్యతో ఓ సినిమాని చేయబోతున్నాడు. ఈ సినిమాలో తను సెంటిమెంట్‌ భావిస్తున్న హీరోయిన్ తీసుకొవాలని చూస్తున్నాడు.

ఇటీవలే శివ దర్శకత్వంలో వచ్చిన విశ్వాసం పెద్ద విజయాన్ని సాధించింది. దీంతో ఈ మూవీ హీరోయిన్‌ నయనతార దర్శకుడు శివకు సెంటిమెంట్‌గా మారిందట. దీంతో సూర్యతో చేసే సినిమాలో నయన్‌నే హీరోయిన్‌గా తీసుకోవాలని భావిస్తున్నాడట.. నయనతార కాల్‌షీట్స్‌ లేకపోయినా..శివ తన సెంటిమెంట్‌ను నయన్‌కు చెప్పాడంతో కాదనలేకపోయిందని సమాచారం. ప్రస్తుతం దర్భార్, బిగిల్ సినిమాలు చేస్తున్న నయన్‌తారకు సెప్టెంబరు వరకూ బిజీగా ఉంటుంది.. కాబట్టి ఆ తరువాత కాల్‌షీట్స్‌ సర్దుబాటు చేయగలనని నయనతార చెప్పడంతో దర్శకుడు శివ సంతోషంగా సరే అన్నారని కోలీవుడ్ సర్కీల్‌లో వినిపిస్తోన్న మాట. మొత్తం మీద శివ సెంటిమెంట్‌ అలా వర్కౌట్‌ అయ్యింది.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *