పూరికి గిఫ్ట్ ఇచ్చిన రామ్

పూరికి గిఫ్ట్ ఇచ్చిన రామ్
సినిమా చిత్రీకరణలో పూరి స్పీడ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే కాబట్టి ఈ సినిమా అతి త్వరలో మనముందుకు వస్తుందని మనం ఫిక్స్ అయిపోవచ్చు. అయితే తన డైరెక్టర్ కి హీరో రామ్ ఒక గిఫ్ట్ ఇచ్చాడు. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన ఆ ప్రపంచంలోనే ఖరీదైన గిఫ్ట్ ఏంటంటే కాఫీ ప్యాకెట్లు. ఈ విషయాన్ని పూరి స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపాడు. కాఫీ సాచెట్ల ఫోటోలతో పాటుగా కాఫీ తాగుతూ ఉన్న మరో ఫోటో పోస్ట్ చేసి “మేరా ఇస్మార్ట్ శంకర్ రామ్, ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన కోపి లువాక్ కాఫీ ని గిఫ్టుగా ఇచ్చాడు. దయచేసి మీరు గూగుల్ చేయండి.. మీకు పిచ్చెక్కడం ఖాయం” అంటూ ట్వీట్ చేశాడు.  అయిదు డిప్ లు ఉండే ఈ కాఫీ ప్యాక్ ధర ఇండియాలో దాదాపుగా నాలుగు వేల రూపాయలు ఉంటుంది.

పూరి మాటలు విని గూగుల్ చేసిన వారు మాత్రం ఆ కాఫీ గురించి తెలిసి షాక్ అవుతున్నారు. అయిదు కాఫీలు అయిదు వేలు, పైగా అందరూ షాక్ అవుతున్నారు అసలు అందులో అంత గ్రేట్ గా ఏముంది అనుకుంటున్నారా? గ్రేట్ కాదండీ షిట్ ఉంది. అవును మీరు వింటున్నది నిజమే రామ్ పోతినేని, పూరి ఇచ్చిన కాఫీ పౌడర్ ని, నిజంగా షిట్ లోనుంచే వస్తుంది. సివెట్ క్యాట్ అనే అడవి పిల్లికి మంచి క్వాలిటీ ఉన్న కాఫీ పండ్లు తిన్పించి, దాని మలం నుండి ఈ కాఫీ బీన్స్ సేకరిస్తారు. ఈ క్యాట్ షిట్ ని చాలా సార్లు క్లీన్ చేసి పౌడర్ గా చేసి అమ్ముతారు. పండ్లు తిన్నప్పుడు పిల్లి కడుపులో జరిగే కెమికల్ చేంజెస్ వలన కాఫీ పొడి టేస్ట్ వస్తుంది అంటారు. మనిషి పిచ్చి కాకపోతే షిట్ కూడా కాస్ట్లీగా తాగుతున్నాడు. ఇప్పుడు రామ్, పూరికి ఇచ్చాడు కాబట్టి ఈ విషయం బయటకి వచ్చింది, ఇలాంటి కాఫీ ఒకటుందని మనకి తెలిసింది. ఇలాంటి వింతలు ఇంకెన్ని ఉన్నాయో.
Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *