రాఘవేంద్రరావు కొత్త ప్రయోగం !

రాఘవేంద్రరావు కొత్త ప్రయోగం !

వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించి తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ కొన్ని ప్రత్యేకమైన పేజీలను లిఖించుకున్నారు దర్శకుడు కె. రాఘవేంద్రరావు. ఆయన తీసిన సినిమాలు కొత్త తరం డైరెక్టర్లకు మార్గదర్శకత్వం అవుతున్నాయి. ఇప్పుడు ఓ ఫార్ములతో తన నెక్ట్స్ సినిమాని తెరకెక్కించబోతున్నాడట.

director k raghavendra rao announced his next film

తెలుగు సినిమాల్లో క‌మ‌ర్షియ‌ల్ సినిమా ఫార్ములాకు స‌రికొత్తగా సొబగులు అద్దిన ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు. హీరో మాస్ ఇమేజ్‌ను ఎలివేట్ చేస్తూనేచ హీరోయిన్ అందంగా ప్రెజెంట్ చేస్తాడు. అప్పటి హీరోల నుండి నేటి కుర్ర హీరోలతో కూడా సినిమాలు తెర‌కెక్కిస్తున్నాడు.. నాగార్జునతో తెరకెక్కించిన భక్తిరస చిత్రం న‌మో వేంక‌టేశాయ తరువాత మరో సినిమా చేయలేదు. ఇప్పుడు నెక్ట్స్ చేయబోయే సినిమాతో కొత్తగా ప్రయత్నించబోతున్నాడు.. ముగ్గురు ద‌ర్శ‌కులు, ముగ్గురు హీరోయిన్స్‌తో సినిమా తెర‌కెక్కించబోతున్నాడు. అయితే ఆ సినిమాలో ఆ ముగ్గురు హీరోయిన్స్, ఆ ముగ్గురు దర్శకులు ఎవరు అనేది సస్పెన్స్‌లో ఉంచాడు. అయితే ఒకొక్క దర్శకుడు ఒక్కో కథని తెరకెక్కిస్తాడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సంబంధించిన పూర్తి వివరాలు అనౌన్స్ చేయబోతున్నాడట. మరి రాఘ‌వేంద్ర‌రావు కొత్త ఫార్ములా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *