ఏపీ ముఖ్యనేతల ఆస్తుల వివరాలు

ఏపీ ముఖ్యనేతల ఆస్తుల వివరాలు

ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ఏపీలో అగ్రనేతలు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్‌ అఫిడవిట్ లో నేతలు తమ ఆస్తుల వివరాలు ప్రకటించారు. మరి ఆస్తుల వివరాలేంటి? వాస్తవంగా ఉన్న ఆస్తులు.. నేతలు ప్రకటించిన వివరాల్లో నిజమెంత? అసలు ఇందులో వాస్తవాలు ఎంత?

ఏపీలో ప్రముఖులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా ఏపీ సీఎం చంద్రబాబు పేరిట నామినేషన్‌ దాఖలైంది. మరోవైపు అఫిడవిట్‌లో చంద్రబాబు తన మొత్తం ఆస్తుల విలువ సుమారు 700 కోట్లుగా పేర్కొన్నారు. మెుత్తం ఆస్తుల్లో తన స్థిర ఆస్తి విలువ రూ. 19 కోట్ల 96 లక్షలు కాగా చరాస్తుల విలువ 47 లక్షల 38 వేల రూపాయలని పొందుపరిచారు. నారా భువనేశ్వరి చరాస్తుల విలువ 574 కోట్లుగా పేర్కొన్నారు.

అటు ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ పులివెందులలో నామినేషన్‌ వేశారు. జగన్‌ నామినేషన్‌ కార్యక్రమానికి వైసీపీ నేతలు భారీగా తరలివచ్చారు. నామినేషన్‌ సమయంలో జగన్‌ వెంట మాజీ ఎంపీ అవినాష్‌రెడ్డి, చిన్నాన్న మనోహర్‌ రెడ్డి అన్నారు. అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం 340 కోట్లకుపైగా ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. భార్య భారతి పేరిట 31.59 కోట్లు, కుమార్తెలు హర్షిణి రెడ్డి పేరిట 6,45 కోట్లు, వర్షా రెడ్డి పేరిట 4,59 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

భీమవరం అసెంబ్లీ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న పవన్‌ కల్యాణ్‌ తన నామినేషన్‌ దాఖలు చేశారు. గురువారం విశాఖ జిల్లా గాజువాకలో జనసేన అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌ ఇవాళ భీమవరంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి తన నామినేషన్‌ పత్రాలు సమర్పించారు. పవన్ కళ్యాణ్‌కు 12 కోట్లు చరాస్తులు, 40 కోట్ల 80 లక్షలు స్థిరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో చూపించాడు. అలాగే దాదాపు 33 కోట్లకు పైగా చేబదులు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

మరోవైపు మంగళగిరిలో నామినేషన్‌ దాఖలు చేసిన మంత్రి నారాలోకేష్ తన ఆస్తుల వివరాలను అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన భార్యా, కుమారుడి పేరిట ఉన్న ఆస్తుల వివరాలను ఆయన వెల్లడించారు. తన ఆస్తులు, అప్పుల వివరాలతో కూడిన అఫిడవిట్‌ను సమర్పించారు. తన దగ్గర రూ.253.68 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని లోకేశ్ అఫిడవిట‌్‌లో పేర్కొన్నారు. తన భార్య బ్రాహ్మణి పేరిట రూ.14.49 కోట్ల విలువైన ఆస్తులు, తన కొడుకు దేవాన్ష్ పేరిట రూ.3.88 కోట్ల విలువైన ఆస్తులున్నాయని తెలిపారు.

ఇక టీడీపీ తరఫున ఎన్నికల బరిలోకి దిగిన నారాయణ విద్యాసంస్థల అధినేత, మంత్రి పి. నారాయణ ఎన్నికల అధికారికి సమర్పించిన అఫిడవిట్ లో తన ఆస్తులు రూ.650 కోట్లకు పైగా చూపించారు.

మరోవైపు నేతలు ప్రకటించిన ఆస్తులలలో నిజమెంత? నిత్యం జగన్‌ లక్ష కోట్లు దోచుకున్నాడని చెప్పే… చంద్రబాబు. అలానే చంద్రబాబు మూడు లక్షల కోట్లు దోచుకున్నాడని జగన్ చేసే ఆరోపణలకు ఇప్పుడు అఫడవిట్‌లో ప్రకటించిన ఆస్తులకు ఏమైనా పొంతన ఉందా? అంటే కాదు అనే సమాధానం వినిపిస్తోంది. అయితే వారు చెప్పేవన్నీ నిజాలు కాదని అందరికీ తెలుసు. మరి నేతలు ఎవరిని .. మభ్యపెడుతున్నానే విమర్శలు వెల్లువెత్తున్నాయి.

Leave a comment

Send a Comment

Your email address will not be published. Required fields are marked *